
‘దేశంలో అరాచక పాలన’
తిర్యాణి(ఆసిఫాబాద్): దేశంలో అరాచక పాలన కొనసాగుతోందని డీసీసీ అధ్యక్షుడు విశ్వప్రసాద్‌రావు అన్నారు. మండల కేంద్రంలో జైబాపు, జైభీమ్, జై సంవిధాన్‌పై సోమవారం నిర్వహించిన కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కుతో కలిసి హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ జైబాపు, జైభీమ్, జై సంవిధాన్ నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్య రక్షణ కోసం ప్రజలను చైతన్యవంతం చేసేదిశగా కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగుతుందన్నారు. మహనీయుల ఆశయ సాధన కోసం ఉద్యమించాలని సూచించారు. కార్యక్రమంలో నాయకులు అనిల్‌గౌడ్, చిత్తరి సాగర్, అమర్, శంకర్ తదితరులు పాల్గొన్నారు.