
‘రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువు’
కాగజ్‌నగర్‌రూరల్: రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువైందని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అఘాయిత్యాలు పెరిగాయని బీఆర్‌ఎస్ నేత ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ ఆరోపించారు. నల్గొండ జిల్లాకు చెందిన మల్లీశ్వరికి నివాళిగా బుధవారం పట్టణంలోని రాజీవ్‌గాంధీ చౌరస్తా వద్ద కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. ఏడేళ్లు సహజీవనం చేసిన తర్వాత మల్లీశ్వరిని యువకుడు మోసం చేసి వేరే అమ్మాయిని వివాహం చేసుకున్నాడని, బాధితురాలు మనస్తాపంతో ఆత్మహత్య చేసుకుందన్నారు. ఆత్మహత్మకు కారణమైన నిందితులను ఇప్పటికీ అరెస్టు చేయకపోవడం దారుణమన్నారు. మహిళలకు రక్షణ కల్పించలేని సీఎం రేవంత్‌రెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు వరలక్ష్మి, రమాదేవి, లావణ్య, కమల, బీనా మండల్, రింకు మండల్ తదితరులు పాల్గొన్నారు.