
ఫిర్యాదులపై స్పందించాలి
వాంకిడి: పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన బాధితుల ఫిర్యాదులు స్వీకరించి సత్వరమే పరిష్కరించాలని ఏఎస్పీ చిత్తరంజన్ సూచించారు. శనివారం మండల కేంద్రంలోని పోలీస్‌స్టేషన్‌లో వార్షిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్‌స్టేషన్ పరిసరాలు, రిసెప్షన్, రి కార్డులు తనిఖీ చేశారు. ఎస్సై, పోలీస్ సిబ్బందికి పలు సూచనలు చేశారు. సమస్యలు తె లుసుకున్నారు. గ్రామాల్లో ప్రజలకు అవగా హన కల్పించి సీసీ కెమెరాలు అమర్చుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపాల ని ఆదేశించారు. అనంతరం పోలీస్‌స్టేషన్ ఆ వరణలో మొక్కలు నాటారు. సీఐ సత్యనారా యణ, ఎస్సై ప్రశాంత్, సిబ్బంది ఉన్నారు.