
సామ్, మామ్ పిల్లలను గుర్తించాలి
వాంకిడి: అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారుల ఎత్తు, బ రువు చూసి వారి ఆరోగ్య స్థితిని అంచనా వేసి సామ్, మామ్ పిల్లల నివేదికలు అందజేయాలని జిల్లా సంక్షేమశాఖ అధికారి ఆడెపు భాస్కర్ సూచించారు. శని వారం మండలంలోని బంబార రైతువేదికలో అంగన్‌వాడీ టీచర్లతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సామ్, మామ్ ద్వారా బలహీన పిల్లలను గుర్తించి అంగన్‌వాడీ కేంద్రాల్లో పౌష్టికాహారం అందించాలని సూచించారు. పిల్లల ఆ రోగ్య పరిస్థితిని మెరుగుపరిచి రోజువారీ వివరాలను పోషణ్ ట్రాకర్‌లో నమోదు చేయాలని తెలిపారు. పి ల్లలు, బాలింతలు, గర్భిణులకు సేవలందించాలని పేర్కొన్నారు. పౌష్టికాహారం అందేలా నిత్యం పర్యవేక్షించాలని సూచించారు. సమావేశంలో జిల్లా పోషణ్ అభియాన్ కోఆర్డినేటర్ గో పాలకృష్ణ, సూపర్‌వైజర్లు భారతి, కుమారి, లత, బ్లాక్ కోఆర్డినేటర్ తౌఫిక్, బాలల సంరక్షణ విభాగం సోషల్ వర్కర్ డోంగ్రి ప్రవీణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.