
ఆర్టీసీ యాప్‌లపై ప్రచారం
ఆసిఫాబాద్‌అర్బన్: ఆర్టీసీ యాప్‌ల ద్వారా అందిస్తున్న అత్యాధునిక సేవలను ప్రజల్లోకి తీసుకవెళ్లడంలో భాగంగా డిపో మేనేజర్ కేవీ రాజశేఖర్ ఆధ్వర్యంలో శనివారం జిల్లా కేంద్రంలోని పలు ప్రభుత్వ కార్యాలయాల్లో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ డీవీ శ్రీనివాస్ రావ్‌కు క్యూఆర్ కోడ్ కలిగిన స్కానర్ కీచైన్ అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ఆర్టీసీ ఆధునిక సౌకర్యాలను ప్రయాణికులు పూర్తిగా వినియోగించుకోవాలని సూ చించారు. ఆర్టీసీ యాప్‌లతో ప్రయాణికులకు సేవలు సులభతరమైనట్లు పేర్కొన్నారు. అనంతరం ఫైర్‌స్టేషన్, ఎస్‌హెచ్‌వో కార్యాలయాల్లో క్యూఆర్ కోడ్ కీచైన్‌లు అందజేశారు.