
పరీక్ష పకడ్బందీగా నిర్వహించాలి
ఆసిఫాబాద్‌రూరల్: నీట్‌ను పకడ్బందీగా నిర్వహించాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రతినిధులు కలెక్టర్, ఎస్పీ, ఉన్నతాధికారులకు సూచించారు. శనివా రం న్యూఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా స మీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మా ట్లాడుతూ.. నీట్‌ను లోటుపాట్లు లేకుండా పటిష్ట బందోబస్తు మధ్య నిర్వహించేలా చర్యలు తీసుకో వాలని ఆదేశించారు. పరీక్షా కేంద్రాల్లో పూర్తి ఏర్పా ట్లు చేయాలని, భద్రత చర్యలు చేపట్టాలని తెలిపా రు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ దీపక్ తివారి మాట్లాడుతూ.. మే 4న మధ్యాహ్నం 2నుంచి సా యంత్రం 5గంటల వరకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఆధ్వర్యంలో నిర్వహించే నీట్ పరీక్షకు జిల్లాలో అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. పరీక్షకు 287 మంది అభ్యర్థులు హాజరు కానున్నట్లు తెలిపారు. కార్య క్రమంలో ఏఎస్సీ ప్రభాకర్‌రావు, పరీక్షల సమన్వయకర్త లక్షీనరసింహ, పర్వవేక్షకులు ఉదయ్‌బాబు, శశిధర్ తదితరులు పాల్గొన్నారు.