
అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు
ఆసిఫాబాద్: అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు అందించేలా చర్యలు తీసుకుంటున్నట్లు అదనపు కలెక్టర్ దీపక్ తివారి తెలిపారు. ఆసిఫాబాద్ మున్సిపాలిటీ పరిధి లో లబ్ధిదారులు చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ ప నులను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రతి ష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకాని కి లబ్ధిదారుల ఎంపిక పాదర్శకంగా ఉండాలని సూ చించారు. పథకం అమలులో ఎదురవుతున్న సమస్యలను గుర్తించి పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. నిరుపేదల సొంతింటి కల నెరవేర్చాలని ప్రభుత్వం ఇందిరమ్మ పథకాన్ని ప్రవేశపెట్టిందని తెలిపారు. అదనపు కలెక్టర్ వెంట మున్సిపల్ కమిషనర్ భుజంగరావు తదితరులున్నారు.
ఇంటి నిర్మాణ పనుల పరిశీలన
వాంకిడి: మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో చేపట్టిన మోడల్ ఇందిరమ్మ ఇంటి నిర్మాణ పనులను అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారి పరిశీలించారు. త్వరగా పనులు పూర్తయ్యేలా చూడాలని అధికారులను ఆదేశించారు. అనంతరం వాంకిడి గ్రామపంచాయతీ పరిధిలోని ఎల్‌ఆర్‌ఎస్ స్థలాలను పరిశీలించారు. రిజిస్ట్రేషన్‌లు త్వరగా పూర్తయ్యేలా ప్రజలకు అవగాహన కల్పించాలని కార్యదర్శి శివకుమార్ సూచనలు చేశారు. అనంతరం ఇందిరమ్మ మోడల్ గ్రామపంచాయతీ జైత్‌పూర్ గ్రామాన్ని సందర్శించారు. లబ్ధిదారులతో మాట్లాడి సందేహాలను నివృత్తి చేశారు. గ్రామాల్లో తాగునీటి సమస్య రాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. డీపీవో భిక్షపతి, తహసీల్దార్ రియాజ్ అలీ, ఎంపీడీవో ప్రవీణ్‌కుమార్, వివిధ శాఖల అధికారులున్నారు.