‘భూభారతి’తో సమస్యలు పరిష్కారం | - | Sakshi
Sakshi News home page

‘భూభారతి’తో సమస్యలు పరిష్కారం

Published Sun, Apr 27 2025 12:18 AM | Last Updated on Sun, Apr 27 2025 12:18 AM

‘భూభారతి’తో సమస్యలు పరిష్కారం

‘భూభారతి’తో సమస్యలు పరిష్కారం

● కలెక్టర్‌ వెంకటేశ్‌ దోత్రే ● చట్టంపై అవగాహన సదస్సు

తిర్యాణి: ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన భూ భారతి–2025 రెవెన్యూ చట్టం ద్వారా భూసమస్యలకు పరిష్కారం దొరుకుతుందని కలెక్టర్‌ వెంకటేశ్‌ దోత్రే పేర్కొన్నారు. శనివారం మండల కేంద్రంలోని ఆశ్రమ పాఠశాలలో నిర్వహించిన భూభారతి అవగాహన సదస్సుకు ఎమ్మెల్సీ దండె విఠల్‌, ఆర్డీవో రాజేశ్వర్‌తో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. చట్టంలోని అప్పీల్‌ వ్యవస్థ ద్వారా రైతులెవరైనా అన్యాయానికి గురైనప్పుడు న్యాయం పొందేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. గ్రామాల్లో ఇప్పటికీ చాలావరకు భూమి హద్దుల గొడవలున్నాయని పేర్కొన్నారు. వాటి పరిష్కారానికి భూభారతి సర్వే ఉపయోగపడనుందని తెలిపారు. జూన్‌ 2 తర్వాత ప్రతీ గ్రామంలో భూసమస్యలపై రెవెన్యూ సదస్సులు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో మండల ప్రత్యేకాధికారి రమాదేవి, తహసీల్దార్‌ సూర్యప్రకాశ్‌, పీఏసీఎస్‌ చైర్మన్‌ చుంచు శ్రీనివాస్‌, ఏవో వినయ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

రెబ్బెన మండల కేంద్రంలో..

రెబ్బెన(ఆసిఫాబాద్‌): మండల కేంద్రంలోని రైతువేదికలో భూభారతి చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించగా ఎమ్మెల్సీ దండె విఠల్‌, ఆర్డీవో లోకేశ్వర్‌తో కలిసి కలెక్టర్‌ వెంకటేశ్‌ దోత్రే హాజరై మాట్లాడారు. భూమి కొనుగోలు, విరాసిత్‌, వారసత్వ భూ మి మార్పిడిలో సర్వేయర్‌ రూపొందించిన కమతం నక్షా జతపర్చడం మూలంగా భవిష్యత్‌లో భూము ల హద్దులు, ఇతర వివాదాలకు తావుండదని పే ర్కొన్నారు. జూన్‌ 2 తర్వాత ప్రతీ గ్రామానికి గ్రామపాలన అధికారులు వస్తారని తెలిపారు. అన్ని గ్రా మాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించి భూభారతిపై మరింత అవగాహన కల్పించి రైతుల నుంచి భూ సమస్యలపై అర్జీలు స్వీకరిస్తారని పేర్కొన్నా రు. ఎమ్మెల్సీ దండె విఠల్‌ మాట్లాడుతూ.. ధరణిలోని లోపాల కారణంగా రాష్ట్ర ప్రభుత్వం భూభా రతి చట్టం తెచ్చిందని చెప్పారు. ధరణి కారణంగా స్వయంగా తానే ఇబ్బందులకు గురైనట్లు గుర్తు చే శారు. డీపీవో భిక్షపతి, తహసీల్దార్‌ రామ్మోహన్‌రా వు, ఎంపీడీవో శంకరమ్మ, ఏవో దిలీప్‌, ట్రాన్స్‌పో ర్ట్స్‌ నాన్‌ ఎక్స్‌ అఫీషియల్‌ సభ్యుడు లావుడ్య రమేశ్‌, డీసీసీ అధ్యక్షుడు విశ్వప్రసాద్‌రావు, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు పల్లె ప్రకాశ్‌రావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement