
జోడేఘాట్ నుంచి యాత్ర ప్రారంభం
కెరమెరి(ఆసిఫాబాద్): మండలంలోని కుమురంభీం పోరుగడ్డ జోడేఘాట్ నుంచి జైబాపు, జైభీమ్, జైసంవిధాన్ యాత్రను బుధవారం కాంగ్రెస్ నాయకులు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాజీ ఎ మ్మెల్యే ఆత్రం సక్కు మాట్లాడారు. మహాత్మా గాంధీ, అంబేడ్కర్, రాజ్యాంగం విలువలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కాంగ్రెస్ పార్టీ జైబాపు, జైభీమ్, జైసంవిధాన్ కార్యక్రమాన్ని చేపట్టిందని తెలిపారు. రాజ్యాంగాన్ని మార్చుతామని బీజేపీ ప్రకటించడం అంబేడ్కర్‌ను అవమానించడమే అవుతుందన్నారు. అంతకు ముందు కరపత్రాలు ఆవిష్కరించారు. నాయకులు ఆత్రం కుసుంబ్‌రావు, మునీర్ అహ్మద్, వసంత్‌రావు, న్యానేశ్వర్, జలపతి రావు, కుత్‌బొద్దీన్, ఇందిరా, తిరుపతి, విశ్వనాథ్, పాలక్‌రావు, భీంరావు, రవి, సిరాజ్, ముజ్జూ పాల్గొన్నారు.