
ఆదివాసీల హక్కులు పరిరక్షించాలి
కెరమెరి(ఆసిఫాబాద్): పాలకులు చట్టాలను మార్చడంతోనే ఆదివాసీల అణిచివేత ప్రారంభమైందని, ఆదివాసీల హక్కులను పరిరక్షించాలని ప్రొఫెసర్ కోదండరాం పేర్కొన్నారు. శనివారం మండలంలో ని జోడేఘాట్‌లో ప్రారంభమైన తుడుందెబ్బ రాష్ట్ర మహాసభకు హాజరయ్యారు. అంతకుముందు కు మురంభీం విగ్రహానికి, అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మహాసభలో మాట్లాడారు. ప్రభుత్వాలు మారుతున్న క్రమంలో 73, 74వ రాజ్యాంగ సవరణతో ఏజెన్సీ ప్రాంత ఆదివాసీలకు కల్పించిన హక్కులు, చట్టాలు ఖూనీ అవుతున్నాయని పేర్కొన్నారు. అ మరుల ఆశయాలు కొనసాగించినప్పుడు, కుల, రా జకీయాలకు అతీతంగా పోరాడినప్పుడు హక్కులు, చట్టాలు అమలుకు నోచుకుంటాయని చెప్పారు. మహాసభలో రాష్ట్ర మహాసభ అధ్యక్షుడు బుర్స పో చయ్య, కోకన్వీనర్ కోట్నాక విజయ్, నాయకులు విజయ్, నగేశ్, లక్ష్మీనారాయణ, నరసింహారావు, రఘుపతిరావు, నారాయణ, బాపు, రవి, రాజేందర్ తదితరులతోపాటు ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం, కరీంనగర్, మహబూబ్‌నగర్ జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు.
జోడేఘాట్‌లో నిర్వహించిన తుడుందెబ్బ రాష్ట్ర మహాసభలో ప్రొఫెసర్ కోదండరాం