
ఆలనాపాలనా లేక అధ్వానం
రెబ్బెన: మండలంలోని చాలా గ్రామపంచాయతీల్లో హ్యాబిటేషన్ల వారీగా ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనాల పరిస్థితి ఇంచుమించు ఒకేలా ఉంది. అతికొద్ది చోట్ల మాత్రమే పచ్చదనం ఉంది. గోలేటి గ్రామ పంచాయతీ పరిధిలోని దేవులగూడ పల్లె ప్రకృతి వనం పూర్తిగా అడవిని తలపిస్తోంది. గతంలో నాటిన మొక్కలు చెట్లుగా మారాయి. వాటిని గుర్తుతెలియని వ్యక్తులు నరికివేస్తున్నా పట్టించుకునే వారే కరువయ్యారు. రాజారం, సన్నాసికుంట, తుంగెడపల్లె ప్రకృతి వనాల్లో మొక్కలు లేకపోవడంతో ప్రభుత్వం లక్ష్యం నీరుగారుతోంది. పులికుంట, గోలేటి పల్లె ప్రకృతి వనాల నిర్వహణను వదిలేసి నెలలు గడుస్తోంది. ప్రజలకు ఆహ్లాదకర వాతావరణం అందించాల్సిన ప్రకృతివనాలు లక్ష్యానికి దూరమవుతున్నాయి.