
మే 20న దేశవ్యాప్త సమ్మె
ఆసిఫాబాద్‌అర్బన్: కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, కర్షక వ్యతిరేక విధానాలకు నిరసనగా మే 20న దేశవ్యాప్త సమ్మె చేపట్టినట్లు ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉపేందర్, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, ఐఎన్‌టీయూసీ జిల్లా అధ్యక్షుడు లోకేశ్, టీయూసీఐ జిల్లా కార్యదర్శి తిరుపతి తెలిపారు. జిల్లా కేంద్రంలోని ఎస్‌టీయూ భవనంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు దివాకర్ అధ్యక్షతన మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. కేంద్రం ప్రభుత్వం నాలుగు లే బర్ కోడ్‌లు వెంటనే రద్దు చేసి, కార్మికులు పోరాట లతో సాధించుకున్న 44 కార్మిక చట్టాలను యథా విధిగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. రైతు వ్యతిరేక చట్టాలను సైతం రద్దు చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వం తీరు మార్చుకోకపోతే దేశవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షుడు శంకర్, ఆర్టీసీ రిటైర్డ్ కార్మిక సంఘం జిల్లా అ ధ్యక్షుడు మల్లేశం, నాయకులు శంకర్ తదితరులు పాల్గొన్నారు.