
గాలిదుమారం.. ఆగమాగం
● నేలకొరిగిన వరి, విద్యుత్ స్తంభాలు ● అంధకారంలో గ్రామాలు
దహెగాం/పెంచికల్‌పేట్/ఆసిఫాబాద్‌రూరల్: జిల్లాలో శనివారం అర్ధరాత్రి, ఆదివారం గాలిదుమారం బీభత్సం సృష్టించింది. దీనికితోడు చిరుజల్లులు పడటంతో ఆరబెట్టిన ధాన్యం తడిసింది. అర్ధరాత్రి కావడంతో రైతులు ధాన్యం కుప్పలపై టార్పాలిన్లు కప్పలేకపోయారు. దహెగాం మండల కేంద్రం సమీపంలో వరి పంట గాలికి నేలవాలింది. ఐనం గ్రామంలో నాలుగు స్తంభాలు విరిగి పడటంతో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. ఆదివారం మధ్యాహ్నం వరకు కరెంటు లేకపోవడంతో మండల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈదురు గాలులకు పెంచికల్‌పేట్, సలుగుపల్లి ప్రధాన రహదారిపై లోడుపల్లి వద్ద భారీ వృక్షం నేలకూలింది. రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పెంచికల్‌పేట్ మండలంలోని పలు గ్రామాలకు విద్యుత్ సరఫరా లేకపోవడంతో ప్రజలు అంధకారంలో గడిపారు. అకాల వర్షం, ఈదురుగాలులకు ఆసిఫాబాద్ మండలంలో కొమ్ముగూడ, గొల్లగూడ, ఈదులవాడ గ్రామాల్లో చెట్లు, విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. అధికారులు తక్షణమే స్పందించి కొత్త స్తంభాలు ఏర్పాటు చేశారు. కోసేందుకు సిద్ధంగా ఉన్న మామిడి కాయలు రాలగా, వరిపైరు నేలవాలింది.
షార్ట్ సర్క్యూట్‌తో నిరుపేద ఇల్లు దగ్ధం
లింగాపూర్: మండలంలోని మా మిడిపల్లి గ్రామానికి చెందిన ఆత్రం తెలంగ్‌రావ్‌కు చెందిన ఇల్లు శని వారం అర్ధరాత్రి షార్ట్ సర్క్యూట్‌తో దగ్ధమైంది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. తెలంగ్‌రావ్ తల్లి, భార్య, ఒక కుమార్తెతో కలిసి ఇంట్లో నిద్రిస్తుండగా, అర్ధరాత్రి ఈదురుగాలులు వీస్తున్న సమయంలో షార్ట్ సర్క్యూట్‌తో మంట లు చెలరేగాయి. కుటుంబ సభ్యులు గమనించి వెంటనే బయటకు పరుగులు తీశారు. చుట్టపక్కల ఉన్న వారు మంటలు ఆర్పేందుకు ప్రయత్నించినా.. గాలి తీవ్రతకు అదుపులోకి రాలేదు. ఇంట్లోని బట్టలు, బియ్యం, జొన్నతో పాటు రూ.40వేల నగదు, రెండు తులాల బంగారు ఆభరణాలు, మూ.30 వేల సామగ్రి మంటల్లో కాలిపోయాయని బాధితుడు తెలిపాడు. విష యం తెలుసుకున్న డిప్యూటీ తహసీల్దార్ పెద్దిరాజు ఇంటిని పరిశీలించారు. కలెక్టర్‌కు వివరాలు సమర్పించి, ప్రభుత్వం నుంచి సాయం అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

గాలిదుమారం.. ఆగమాగం

గాలిదుమారం.. ఆగమాగం

గాలిదుమారం.. ఆగమాగం

గాలిదుమారం.. ఆగమాగం