సమాచారం తెలిసేదెలా..? | - | Sakshi
Sakshi News home page

సమాచారం తెలిసేదెలా..?

Published Mon, Apr 28 2025 12:10 AM | Last Updated on Mon, Apr 28 2025 12:10 AM

సమాచా

సమాచారం తెలిసేదెలా..?

తిర్యాణి(ఆసిఫాబాద్‌): జిల్లావ్యాప్తంగా ప్రస్తుతం ఉపాధిహామీ పనులు జోరుగా సాగుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఎండను సైతం లెక్క చేయకుండా కూలీలు పనులకు వెళ్తున్నారు. అయితే జిల్లాలో ఉపాధి కూలీలకు పే స్లిప్‌ల పంపిణీ నిలిచిపోవడంతో వేతన వివరాలు తెలియడం లేదు. పనులకు వెళ్లేవారు చాలా మందికి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న జన్‌మన్‌ రేగా యాప్‌పై అవగాహన లేకపోవడంతో వివరాలు తెలుసుకోవడం కష్టంగా మారింది.

మూడేళ్లుగా ఇదే తంతు..

జిల్లావ్యాప్తంగా 1.23 లక్షల జాబ్‌కార్డులు ఉండగా 2.43 లక్షల మంది కూలీలు సభ్యత్వం కలిగి ఉన్నారు. ఇందులో 91 వేల జాబ్‌కార్డులు యాక్టీవ్‌గా ఉండగా 1.70 లక్షల కూలీలు నిత్యం పనులకు వెళ్తున్నారు. జిల్లాలోని 15 మండలాల పరిధిలో ఒకటి, రెండు మండలాలను మినహాయిస్తే మిగిలిన అన్ని ప్రాంతాల్లో ఉపాధిహామీ పనులు చేపడుతున్నారు. కూలీలకు మాత్రం వేతన స్లిప్‌లు ఇవ్వడం లేదు. మూడేళ్ల క్రితం వరకు సక్రమంగా అందించగా, వివిధ కారణాలతో పంపిణీ నిలిపివేశారు. ప్లే స్లిప్‌లో కూలీ పేరు, పని ప్రదేశం పేరు, ఎన్ని పని దినాలు చేశారు, రోజుకు కూలి ఎంత పడింది, చేసిన పని దినాలు ద్వారా వచ్చే వేతనం ఎంత, తదితర వివరాలు ఉంటాయి. వంద రోజులు పూర్తికావడానికి ఇంకా ఎన్ని రోజులు మిగిలి ఉన్నాయి అనే సమాచారం కూడా అందులో తెలియజేస్తారు. సదరు కూలీకి ఏ పని ప్రదేశంలో ఎన్ని రోజులు పని చేశారో, ఎంత వేతనం వస్తుందో సృష్టంగా అర్థమయ్యేది. ప్రస్తుతం స్లిప్‌ల పంపిణీ చేయకపోవడంతో కూలీలకు వారానికి ఎంత పడుతుందో తెలియడం లేదు. వివరాలు స్పష్టంగా తెలిస్తే ఒక వారం తక్కువ పడినా.. మరోవారం నుంచి గరిష్ట వేతనం కోసం అధికంగా పని చేసేందుకు ఆసక్తి చూపుతారు. ఉపాధిహామీ గరిష్ట వేతనం రూ.307 కాగా జిల్లాలో ప్రస్తుతం సగటు కూలి రూ.220 వరకు మాత్రమే ఉంది.

యాప్‌పై అవగాహనేది..?

ఉపాధిహమీ పథకంలో పనిచేస్తున్న కూలీలకు సంబంధించి హాజరు, వేతన వివరాలు, మిగిలి ఉన్న పనిదినాలు వంటి వివరాలు ‘జన్‌మన్‌ రేగా‘ పేరుతో కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ప్రత్యేక యాప్‌లోనూ పొందుపరుస్తున్నారు. జిల్లాలో గిరిజనులతోపాటు సాధారణ ప్రజలకు అవగాహన లేదు. క్షేత్రస్థాయిలో ఈ యాప్‌పై ఈజీఎస్‌ అధికారులు, సిబ్బంది కూలీలకు సక్రమంగా అవగాహన కల్పించలేదు. అసలు ఈ యాప్‌ ఉన్నట్లు కూడా పది శాతం మంది కూలీలకు కూడా తెలియదు.

ఎంత పడుతున్నాయో..

ఉపాధి పనులకు క్రమం తప్పకుండా వెళ్తుంటా. కానీ రోజుకు కూలీ ఎంత పడుతుందో తెలియడం లేదు. నాలుగైదు వారాలకు సంబంధించిన డబ్బులు పడ్డాక ఒకసారి పోస్టాఫీస్‌ ఖాతా నుంచి విత్‌డ్రా చేసుకుంటున్నా. ప్రతీ వారం ఎంత కూలి పడుతున్నాయో అర్థం కావడం లేదు.

– మల్రాజ్‌ శ్రీనివాస్‌, గోలేటి, మం.రెబ్బెన

పే స్లిప్‌లు అందించాలి

ఉపాధి పనులు చేస్తున్న కూలీలందరికీ ప్రతీ వారం తప్పనిసరిగా పే స్లిప్‌లు అందించాలి. పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదు. కేంద్ర ప్రభుత్వం జన్‌మన్‌ రేగా యాప్‌ అందుబాటులోకి తెచ్చినా క్షేత్రస్థాయిలో కూలీలకు అవగాహన కల్పించడం లేదు.

– రాయిల్ల నర్సయ్య, జిల్లా అధ్యక్షుడు, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం

జిల్లాలో నిలిచిన ఉపాధి కూలీల పే స్లిప్‌ల పంపిణీ

‘జన్‌మన్‌ రేగా’ యాప్‌పైనా అవగాహన కరువు

వివరాలు తెలియక ఇబ్బందులు

కూలీలు నష్టపోయే అవకాశం

సాధారణంగా ఉపాధిహామీ పథకం పనులకు సంబంధించిన డబ్బులు పోస్టాఫీస్‌ లేదా బ్యాంకు ఖాతాల ద్వారా చెల్లిస్తున్నా రు. జిల్లాలో ఇప్పటికీ సగానికి పైగా పోస్టాఫీస్‌ ఖాతాల్లోనే జమ అవుతున్నాయి. కూలీలకు ఒకేసారి రెండు లేదా అంతకన్నా ఎక్కువ వారాలకు సంబంధించిన మొత్తాలను ఒకేసారి జమ చేస్తుంటారు. జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో అధికంగా నిరాక్ష్యరాసులు ఉన్నారు. వారికి ఖాతాల్లో ఎంత నగదు జమయ్యిందో తెలియడం లేదు. బీపీఎంలు నగదు విత్‌డ్రా సమయంలో గతంలో పలు అక్రమాలకు పాల్పడ్డారు. అమాయకులను మోసం చేశారు. ఒకవేళ బ్యాంక్‌ ఖాతాల్లో జమ చేసినా ఏటీఎంలు లేక మినీ ఏటీఎంలను ఆశ్రయించాల్సిందే. వేతన వివరాలు తెలియకుంటే మినీ ఏటీఎం నిర్వాహకులు సైతం అక్రమాలకు పాల్పడే అవకాశం ఉంది.

సమాచారం తెలిసేదెలా..?1
1/2

సమాచారం తెలిసేదెలా..?

సమాచారం తెలిసేదెలా..?2
2/2

సమాచారం తెలిసేదెలా..?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement