తాగునీటి సమస్యలు రానీయొద్దు
ఆసిఫాబాద్: వేసవిలో తాగునీటి సమస్యలు రానీ యొద్దని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ నుంచి అదనపు కలెక్టర్ దీపక్ తివారితో కలిసి మంగళవారం అన్ని మండలాల ఎంపీడీవోలు, మండల పంచాయతీ అధికారులు, కార్యదర్శులు, మిషన్ భగీరథ ఇంజినీర్లు, ఉపాధి హామీ సిబ్బందితో తాగునీరు, ఇందిరమ్మ ఇండ్లు, ఉపాధిహామీ పనుల కల్పనపై సమీక్షా సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ మారుమూల గ్రామాల్లో తాగునీటి ఇబ్బంది లేకుండా ప్రత్యామ్నా య మార్గాలు అన్వేషించాలన్నారు. పైప్‌లైన్లు, మో టార్లు, గేట్‌వాల్ ఇతర మరమ్మతులు చేపట్టి నీటి సరఫరాను పునరుద్ధరించాలని ఆదేశించారు. అలా గే జాబ్‌కార్డు కలిగిన ప్రతీ కుటుంబానికి వందరోజు ల ఉపాధిహామీ పనిదినాలు కల్పించాలన్నారు. పని ప్రదేశంలో కూలీలకు నీడ, తాగునీరు, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు, మందులు అందుబాటులో ఉంచాలన్నా రు. ఇందిరమ్మ ఇండ్లు పథకంలో పైలట్ గ్రామాల్లో బేస్‌మెంట్ పనులు పూర్తిచేసిన లబ్ధిదారులకు బిల్లులు చెల్లించాలని సూచించారు. సమావేశంలో డీఆర్‌డీవో దత్తారావు, డీపీవో భిక్షప తి, జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి రమాదేవి, జె డ్పీ సీఈవో లక్ష్మీనారాయణ, అదనపు డీఆర్‌డీవో రామకృష్ణ, గృహనిర్మాణ శాఖ అధికారులు పాల్గొన్నారు.
యువ వికాసం దరఖాస్తులు పరిశీలించాలి
నిరుద్యోగ యువత సంక్షేమం కోసం ప్రభుత్వం ప్ర వేశపెట్టిన రాజీవ్ యువ వికాసం పథకానికి వచ్చిన దరఖాస్తులను క్షుణ్నంగా పరిశీలించాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసి న ప్రజాపాలన సేవా కేంద్రాన్ని అదనపు కలెక్టర్ దీ పక్ తివారి, ఆర్డీవో లోకేశ్వర్‌రావుతో కలిసి సందర్శించారు. రాజీవ్ యువ వికాసం పథకంలో వచ్చి న దరఖాస్తులను పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడు తూ జిల్లాలోని అర్హులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఇతర ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు చెందిన నిరుద్యోగులు మీసేవ కేంద్రాల ద్వారా రాజీవ్ యు వ వికాసానికి ఈ నెల 14 వరకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. సంబంధిత ప్రతులను దరఖాస్తుదా రుల నుంచి అధికారులు తీసుకుని క్షేత్రస్థాయిలో పరిశీలించాలని ఆదేశించారు. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో వచ్చిన దరఖాస్తుల నమోదు ప్రక్రియను పరిశీలించి.. పథకం నిర్వహణపై అధికారులు, సిబ్బందికి సూచనలిచ్చారు. కార్యక్రమంలో ఎస్సీ సహకార సంస్థ ఈడీ సజీవన్, తహసీల్దార్ రోహిత్ దేశ్‌పాండే, ఎంపీడీవో శ్రీనివాస్, ఈ డిస్ట్రిక్ట్ మేనేజర్ గౌత మ్ కుమార్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
కలెక్టర్ వెంకటేశ్ దోత్రే
మండలస్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్


