
వలసవాదులతో ఆదివాసీలకు అన్యాయం
కెరమెరి(ఆసిఫాబాద్): 1976 తర్వాత వచ్చిన వలసవాదులతో ఆదివాసీలకు అన్యాయం జరుగుతోందని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫె సర్ డీఎస్‌డబ్ల్యూ శ్రీనివాస్‌రావు, పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆత్రం భుజంగ్‌రావు అన్నా రు. కెరమెరి మండలం జోడేఘాట్‌లో ఆదివారం తుడుందెబ్బ రాష్ట్ర మహాసభలు రెండోరోజూ కొనసాగాయి. కుమురంభీం విగ్రహానికి పూలమాల వే సి నివాళులర్పించి, అనంతరం సమాధిపై పూలు చ ల్లి పూజలు చేశారు. మ్యూజియాన్ని సందర్శించా రు. అనంతరం శ్రీనివాస్‌రావు మాట్లాడుతూ వలసవాదులతో స్థానిక ఆదివాసీలు పౌరహక్కులతోపా టు రిజర్వేషన్లలో దోపిడీకి గురవుతున్నారన్నారు. లంబాడాలను కేవలం విద్యాభివృద్ధి కోసం ఎస్టీలు గా పరిగణించారని, దీనిని సాకుగా చూపి కాలపరి మితి ముగిసినా వారికి విద్యా, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో రిజర్వేషన్లు కొనసాగుతున్నాయని అన్నారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చినవారు రిజర్వేషన్లు అ నుభవిస్తున్నారని ఆరోపించారు. ఎస్టీ జాబితా నుంచి లంబాడాలను తొలగించాలనే ఆదివాసీల డి మాండ్ న్యాయపరమైందని స్పష్టం చేశారు.
విచ్ఛిన్నానికి కుట్ర..
హెచ్‌ఆర్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు భుజంగ్‌రావు మాట్లాడుతూ కొన్ని రాజకీయ పార్టీలు ఆదివాసీ ఉద్యమకారులను స్వప్రయోజనాల కోసం విభజిస్తున్నాయ ని ఆరోపించారు. హక్కులు, చట్టాలను కాలరాస్తూ ఓటుబ్యాంకుగా మార్చుకున్నాయన్నారు. కార్యక్రమంలో తుడుందెబ్బ రాష్ట్ర కన్వీనర్ బుర్స పోచ య్య, కోకన్వీనర్ లక్ష్మీనారాయణ, కోట్నాక విజయ్ కుమార్, జిల్లా అధ్యక్షుడు కోవ విజయ్, నాయకులు నగేశ్, రఘుపతిరావు, రవి, బాపు, నరసింహరావు, కిశోర్, నారాయణ, ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం, కరీంనగర్, మహబూబ్‌నగర్ జిల్లా అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, విద్యార్థి, మహిళా, రైతు సంఘాల నాయకులు పాల్గొన్నారు.
హెచ్‌సీయూ ప్రొఫెసర్ శ్రీనివాస్‌రావు
రెండోరోజూ తుడుందెబ్బ మహాసభలు