
అప్రమత్తతతోనే అగ్ని ప్రమాదాల నివారణ
ఆసిఫాబాద్‌అర్బన్: అప్రమత్తతతోనే అగ్ని ప్ర మాదాల నివారణ సాధ్యమవుతుందని జిల్లా ఫైర్ అధికారి సురేశ్‌కుమార్ అన్నారు. అగ్ని మాపక వారోత్సవాల్లో భాగంగా రెండోరోజు మంగళవారం జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో ప్రయాణికులకు అగ్ని ప్రమాదాల నివారణ, అరికట్టడం ఎలా అనే అంశంపై అవగాహన కల్పించారు. ఆయన మాట్లాడుతూ ‘అగ్ని నివారణపై అవగాహన పెంచుదాం.. సురక్షిత భారతాన్ని నిర్మిద్దాం’ అనే నినాదంతో ఈ నెల 14 నుంచి 20 వరకు పలు కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలి పారు. అనంతరం అగ్ని ప్రమాదాల నివారణ కు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పోస్టర్ ఆవిష్కరించారు. లీడింగ్ ఫైర్‌మెన్ శ్రీనివాస్, డీవోపీలు నర్సింగ్, రమేశ్, ఫైర్‌మెన్లు స్వామి, శరత్, శివకుమార్, నరేష్, హోగార్డులు రాము, జనార్దన్, తులసీదాస్ ఉన్నారు.