
ఉగ్రవాదుల చర్యలు అమానుషం
ఆసిఫాబాద్: జమ్మూకశ్మీర్‌లోని పహల్గాం స మీపంలో జరిగిన ఉగ్రవాదుల దాడులు అ మానుషమని, దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని ఆసిఫాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రాపర్తి రవీందర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని బార్ అసోసియేషన్ హాల్‌లో ఉగ్రదాడిలో మృతి చెందిన వారి ఆత్మకు శాంతి చే కూరాలని గురువారం న్యాయవాదులు మౌనం పాటించారు. కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు చంద్రకుమార్, కార్యదర్శి చరణ్, న్యాయవాదులు టి.సురేశ్, జగన్మోహన్‌రావు, శ్యాంకుమార్, సతీశ్‌బాబు, విద్యాసాగర్, అంజలి, గణపతి, గణేశ్, అరవింద్ పాల్గొన్నారు.