
‘కాంగ్రెస్‌తోనే అభివృద్ధి సాధ్యం’
వాంకిడి: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంతోనే గ్రామాల అభివృద్ధి సాధ్యమని డీసీసీ అధ్యక్షుడు విశ్వప్రసాద్‌రావు అన్నారు. మండలంలోని సమేల గ్రామంలో ఉపాధిహామీ పథకం కింద రూ.13 లక్షలతో మంజూరైన సీసీరోడ్డు పనులను గురువారం ప్రారంభించారు. ఆ యన మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనేక అభివృద్ధి పనులకు శ్రీకారం చు ట్టిందన్నారు. పేదలకు ఇళ్లు, రైతులు, ఉపాధి హామీ కూలీలు, నిరుద్యోగులకు ఆర్థిక తోడ్పా టు అందిస్తుందన్నారు. అన్నివర్గాల వారికి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని పే ర్కొన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గుర్నులె నారాయణ, యూత్ అ ధ్యక్షుడు ప్రశాంత్, నాయకులు జీవన్, నాగభూషన్, సంతోష్, తిరుపతి పాల్గొన్నారు.