
బాల్యవివాహాలు అరికట్టాలి
ఆసిఫాబాద్‌అర్బన్: బాల్య వివాహాలు అరికట్టాలని జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్‌పర్సన్ ప్రియాంక కనుంగో అ న్నారు. బాల్య వివాహాల నిర్మూలనకు తీసుకుంటున్న చర్యలను ఢిల్లీ నుంచి గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. జిల్లా సంక్షేమ అధికారి భాస్కర్, జిల్లా బాల ల సంరక్షణ అధికారి బూర్ల మహేశ్‌కు పలు సూచనలు చేశారు. జాతీయ బాలల హక్కు ల పరిరక్షణ కమిషన్ చైర్‌పర్సన్ మాట్లాడు తూ జిల్లాలో ఎక్కడా బాల్యవివాహాలు జరగకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలన్నా రు. ఎవరినీ ఉపేక్షించకుండా మొదట జుడిషయల్ ఇంజెక్షన్ ఆర్డర్స్ జారీ చేసి, సంబంధిత పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని సూచించారు. బాల్య వివాహాల ముక్త్ భారత్‌గా తీర్చిదిద్దేందుకు సమన్వయంతో కృషి చేయాలన్నారు. బాలల హక్కుల ఉల్లంఘనలు జరగకుండా పనిచేయాలని ఆదేశించారు. బాల్య వివాహాలతో జరిగే నష్టాలను గ్రామాల్లో వివరించాలని సూచించారు.