
వైద్యసిబ్బందిపై చర్యలు తీసుకోవాలని వినతి
కెరమెరి(ఆసిఫాబాద్): జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటించడం లేదని, వారిపై తక్షణ మే చర్యలు తీసుకోవాలని మానవ హక్కుల కమిటీ జిల్లా చైర్మన్ రాథోడ్ రమేశ్ కోరారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలో మంగళవారం డీఎంహెచ్‌వో సీతారాంను కలిసి వినతిపత్రం అందించారు. ఆయన మాట్లాడుతూ పేదల కు ఉచిత వైద్యం అందించాలనే ఉద్దేశంతో ప్ర భుత్వం ఆస్పత్రులు ఏర్పాటు చేసినా సిబ్బంది, డాక్టర్లు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపించారు. ఇటీవల కెరమెరి పీహెచ్‌సీకి వైద్యం కో సం వెళ్తే.. అక్కడ ఎవరూ లేని పేర్కొన్నారు. ఆయన వెంట నాయకులు నైతం మోహన్, నైతం భానుచందర్, చౌరే మహేశ్ ఉన్నారు.