
అటవీశాఖ మంత్రిని కలిసిన ఎమ్మెల్యే ‘పాల్వాయి’
బెజ్జూర్(సిర్పూర్): హైదరాబాద్‌లో రాష్ట్ర అట వీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ ను గురువారం సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు, ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ మర్యాదపూర్వకంగా కలిశారు. పోడు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని వినతిపత్రం అందించారు. ఎమ్మె ల్యే హరీశ్‌బాబు మాట్లాడుతూ పోడు రైతులను అటవీశాఖ అధికారులు వేధిస్తున్నారని ఆరోపించారు. బెదిరింపులకు పాల్పడుతూ వారి జీవనాధారాన్ని లాక్కునే ప్రయత్నం చేస్తున్నారని వివరించారు. తునికాకు సేకరణను కూడా అడ్డుకుంటున్నారని తెలిపా రు. స్పందించిన మంత్రి పోడు రైతులకు ఇబ్బందులకు గురిచేయొద్దని పీసీసీఎఫ్ ప్రిన్సిపల్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్టు డోబ్రియల్‌ను ఆదేశించారు.