
యువ కార్మికులు అంకితభావంతో పనిచేయాలి
● జీఎం విజయ భాస్కర్‌రెడ్డి
రెబ్బెన(ఆసిఫాబాద్): సింగరేణిలో నూతనంగా ఉద్యోగాలు పొందుతున్న యువ కార్మికులు అంకితభావంతో పనిచేసి సంస్థ పురోభివృద్ధికి తోడ్పాటు ను అందించాలని బెల్లంపల్లి ఏరియా జనరల్ మేనేజర్ విజయ భాస్కర్‌రెడ్డి అన్నారు. గోలేటి టౌన్‌షిప్‌లోని జీఎం కార్యాలయ ఆవరణలో కారుణ్య నియామకాల ద్వారా ఉద్యోగాలు పొందిన వారికి గురువారం నియామక పత్రాలు అందించారు. జీఎం మాట్లాడుతూ సింగరేణి ఉద్యోగంలో చేరే యువకులు సంస్థ ఖ్యాతిని పెంచాలన్నారు. సింగరేణిలో ఉద్యోగం లభించడం అదృష్టంగా భావించాల ని, క్రమశిక్షణతో పనిచేసి ఉత్పత్తి, ఉత్పాదకత, లక్ష్య సాధనలో భాగస్వాములు కావాలని సూచించారు. సింగరేణి సంస్ధ ఉద్యోగులకు కల్పిస్తున్న సౌకర్యాలు మరే కంపెనీ కల్పించదన్నారు. విధుల కు గైర్హాజరు కావ్దొదన్నారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ బ్రాంచి ఉపాధ్యక్షుడు బయ్య మొగిళి, కై రి గూడ పీవో నరేందర్, ఎస్‌వోటూజీఎం రాజమల్లు, డీజీఎం ఉజ్వల్‌కుమార్, ఏరియా సెక్యూరిటీ అధికా రి ఉమాకాంత్, పర్సనల్ మేనేజర్ రెడ్డిమల్ల తిరుపతి, ప్రాజెక్టు ఇంజనీరు వీరన్న, డీవైపీఎం వేణు తదితరులు పాల్గొన్నారు.