‘పోషణ పక్వాడ’ విజయవంతం చేయాలి
ఆసిఫాబాద్‌అర్బన్: జిల్లాలో ఈ నెల 22 వరకు నిర్వహించే పోషణ పక్వాడ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో గురువారం జిల్లా మహిళా, శిశు, వయోవృద్ధులు, దివ్యాంగుల సంక్షేమశాఖ ఆధ్వర్యంలో జిల్లా సంక్షే మ అధికారి భాస్కర్‌తో కలిసి ఐసీడీఎస్ సీడీపీవో లు, సూపర్‌వైజర్లు, పంచాయతీ కార్యదర్శులు, మెప్మా అధికారులు, యూనిసెఫ్ ప్రతినిధులతో స మీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ 15 రో జులపాటు అంగన్‌వాడీ కేంద్రాల్లో నిర్వహించే పోషణ పక్వాడ కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలన్నారు. గర్భిణులు ప్రతినెలా బరువు పరిశీలించుకోవాలని, అవసరమైన పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. పిల్లల్లో మానసిక, శారీరక ఎదుగుదలను పర్యవేక్షించాలని సూచించారు. ఎదుగుదల లోపం ఉన్నవారికి పౌష్టికాహారం, మందులు అందించి సాధారణ స్థితికి తీసుకురావాలన్నారు. సమావేశంలో డీఎల్‌పీవో ఉమర్ హుస్సేన్, మెప్మా పీడీ మోతీరాం తదితరులు పాల్గొన్నారు.
ప్రజలకు మెరుగైన సేవలందించాలి
ప్రభుత్వ ఆస్పత్రులు, ఆరోగ్య కేంద్రాల్లో ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో గురువారం డీఎంహెచ్‌వో సీతారాంతో కలిసి ప్రాథమిక, సామాజిక ఆరోగ్య కేంద్రాల వైద్యులు, ఆయుష్ డాక్టర్లు, పీఎం జన్‌మన్ సిబ్బంది, సూపర్‌వైజర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. మారుమూ ల గిరిజన ప్రాంతాలు, పీవీటీజీ ప్రాంతాల్లో ప్రత్యేక వైద్యశిబిరాలు ఏర్పాటు చేయాలన్నారు. వైద్య ఆ రోగ్యశాఖలో పూర్తిస్థాయిలో వైద్యులు, సిబ్బంది ఉ న్నారని తెలిపారు. వేసవి నేపథ్యంలో వడదెబ్బ బా ధితులకు తక్షణమే వైద్యం అందించాలని, ప్రజలకు జాగ్రత్తలు వివరించాలని సూచించారు.
కలెక్టర్ వెంకటేశ్ దోత్రే


