
అభివృద్ధి పనుల్లో అలసత్వం ఉపేక్షించం
నిర్మల్‌చైన్‌గేట్: ‘అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యానికి తావులేదు.. పనులు చేయడంలో అలసత్వం వహించేవా రిని ఉపేక్షించేది లేదు.. పనులను నిర్ణీత గడువులో పు నాణ్యతతో పూర్తి చేయించాలి’ అని రాష్ట్ర పంచా యతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణనీటి సరఫ రా, మహిళా శిశుసంక్షేమ శాఖ మంత్రి ధనసరి సీత క్క అధికారులను ఆదేశించారు. నిర్మల్ కలెక్టరేట్‌లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధి పనులపై శని వారం ఆయా శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యం వహిస్తున్న కాంట్రాక్టర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. టెండర్ దశ నుంచే పనులు వేగవంతం చేసి, వర్షాకాలానికి ముందు పనులు పూర్తిచేయాలన్నా రు. ఆలస్యం చేస్తున్న గుత్తేదారులకు నోటీసులు జా రీ చేసి, పనులు పూర్తి చేయించాలని సూచించారు. పనుల నాణ్యతపై రాజీ లేకుండా చూడాలని, కాంట్రాక్టర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించి సూచనలి వ్వాలని ఆదేశించారు. సాగునీరు, తాగునీటి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికా రులను ఆదేశించారు. అధికారులు ప్రజాప్రతినిధులకు వాస్తవాలు చెప్పాలని, ఫీల్డ్ విజిట్ చేసి ఏఈలు మిషన్ భగీరథ పనులు సమీక్షించుకోవాలన్నారు.
అంగన్‌వాడీల బలోపేతం, సౌకర్యాల విస్తరణ
త్వరలో అంగన్‌వాడీల్లో టీచర్లు, ఆయాల ఖాళీలను భర్తీ చేస్తామని మంత్రి తెలిపారు. సొంత భవనాలు లేని కేంద్రాలకు రూ.12 లక్షలతో పక్కా భవనాలు నిర్మిస్తామని పేర్కొన్నారు. గతంలో మండలానికో భవనం నిర్మిస్తే, ఇప్పుడు రెండు నిర్మించేలా ప్రణా ళికలు సిద్ధం చేశామన్నారు. మూడేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా అంగన్‌వాడీలకు సొంత భవనాలు, విద్యుత్, మరుగుదొడ్లు, తాగునీటి సౌకర్యాలు కల్పిస్తామన్నారు. మినీ అంగన్‌వాడీలను అప్‌గ్రేడ్ చేస్తామని, సీనియర్ సిటిజన్ డే కేర్ సెంటర్లు, ట్రాన్స్‌జెండర్ క్లినిక్‌లు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.
మహిళా సంఘాలకు చెక్కులు..
మంత్రి సీతక్క, కలెక్టరేట్‌కు చేరుకోగానే పోలీసులు గౌరవ వందనం చేశారు. మహిళా పోలీసులు ఏర్పా టు చేసిన ‘శివంగి’ బృందాన్ని లాంఛనంగా ప్రారంభించి, రాష్ట్రానికి ఆదర్శంగా నిలుస్తుందని కొని యాడారు. తర్వాత మహిళా సంఘాలు, మెప్మాలకు మంజూరైన చెక్కులను కలెక్టర్ అభిలాష అభినవ్, ప్రజాప్రతినిధుల సమక్షంలో పంపిణీ చేశారు. బ్యాంక్ లింకేజీ, రుణాల మంజూరు, వసూలులో ని ర్మల్ జిల్లా ప్రగతిని మంత్రి ప్రశంసించారు. స మావేశంలో ఎంపీ గోడం నగేశ్, నిర్మల్, ఆదిలాబా ద్, ముధోల్, ఖానాపూర్, సిర్పూర్, ఆసిఫాబాద్, బోథ్ ఎమ్మెల్యేలు మహేశ్వర్‌రెడ్డి, పాయల్ శంకర్, పవా ర్ రామారావు పటేల్, వెడ్మా బొజ్జు పటేల్, పాల్వా యి హరీశ్‌బాబు, కోవ లక్ష్మి, అనిల్ జాదవ్, ఎమ్మెల్సీ దండే విఠల్, ఐసీడీఎస్ సెక్రటరీ అనితా రామచంద్రన్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాల కలెక్టర్లు కు మార్ దీపక్, అభిలాష అభినవ్, ఐటీడీఏ పీవో కు ష్బూగుప్తా, అదనపు కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్, కిశోర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యానికి తావులేదు
అలసత్వం వహించే కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలి
త్వరలో అంగన్‌వాడీల్లో ఖాళీల భర్తీ
రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క
ఉమ్మడి జిల్లా పంచాయతీరాజ్, మిషన్ భగీరథ, సీ్త్ర శిశు సంక్షేమ శాఖలపై సమీక్ష
అభివృద్ధి పనుల తీరుపై ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేల అసంతృప్తి

అభివృద్ధి పనుల్లో అలసత్వం ఉపేక్షించం