‘ఇంటిగ్రేటెడ్’ నిర్మాణానికి స్థల పరిశీలన
ఆసిఫాబాద్: వాంకిడి మండలం ఇందాని శివారులో రూ.200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మించే స్థలాన్ని తెలంగాణ ఎడ్యుకేషనల్ వెల్ఫేర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఎండీ గణపతిరెడ్డి మంగళవారం ఎస్‌ఈ షఫీ మియా, ఈఈ అశోక్, తహసీల్దార్ రియాజ్‌తో కలిసి పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ సమీకృత గురుకులానికి 15 ఎకరాలు అనుకూలంగా ఉన్నట్లు గుర్తించామన్నారు. నెల రోజుల్లో ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణానికి టెండర్లు నిర్వహిస్తామని తెలిపా రు. మూడు నెలల్లో పనులు ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఆయన వెంట డీఈఈ శ్రీనివాస్‌గౌడ్, ఏఈ కిరణ్‌కుమార్, అధికారులు ఉన్నారు.


