
పనులు వేగవంతం చేయాలి
తిర్యాణి(ఆసిఫాబాద్): ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు వేగవంతం చేయాలని అదనపు కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. మండల కేంద్రంలో ఇందిరమ్మ మోడల్ ఇంటి నిర్మాణంతోపాటు పైలట్ ప్రాజెక్టు కింద ఎంపికై న రొంపెల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను గురువారం పరిశీలించారు. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ లబ్ధిదారులకు ఇళ్ల నిర్మాణానికి ఆర్థిక సమస్యలు ఉంటే మహిళా సంఘాల ద్వారా రుణాలు అందిస్తామని తెలిపారు. అంతకు ముందు మండల కేంద్రంలో చేపడుతున్న కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్, పీహెచ్‌సీ భవన మరమ్మతులను పరిశీలించారు. పనులు పూర్తిచేసి త్వరగా అందుబాటులోకి తీసుకురావాలని కాంట్రాక్టర్లను ఆదేశించారు. రొంపెల్లి గ్రామంలో సన్నబియ్యం పంపిణీని ప్రారంభించారు. ఎంపీడీవో వేముల మల్లేశ్, ఈజీఎస్ ఏపీవో షాకీర్ ఉస్మాని, పంచాయతీ కార్యదర్శులు వెంకటేశ్, రాజేశ్వరి తదితరులు ఉన్నారు.