చూతము రారండి | - | Sakshi
Sakshi News home page

చూతము రారండి

Published Sun, Apr 6 2025 1:56 AM | Last Updated on Sun, Apr 6 2025 2:03 AM

చూతము

చూతము రారండి

● ముస్తాబైన ఆలయాలు ● భక్తులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు

గ్రామాలన్నీ శ్రీరామ నామస్మరణతో మారుమోగుతున్నాయి. ప్రతీ ఆలయంలో ఆ కోదండ రాముడి పేరే వినిపిస్తోంది. శ్రీరామ నవమి సందర్భంగా ఆదివారం నిర్వహించే శ్రీసీతారాముల కల్యాణ మహోత్సవానికి పుష్పాలంకరణ, రంగవల్లులు, విద్యుద్దీపాలతో ఆలయాలు ముస్తాబయ్యాయి. ‘సీతారాముల కల్యాణం చూతము రారండి’ అంటూ ఆహ్వాన పత్రికలు ఇప్పటికే పంపిణీ చేశారు. అంగరంగ వైభవంగా జరిగే పెళ్లివేడుకను తిలకించేందుకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశారు. నీడ కోసం షామియానాలు, పచ్చని పందిర్లు వేశారు. తాగునీటిని అందించడంతోపాటు అన్నదానం నిర్వహించనున్నారు. – కౌటాల/దహెగాం/రెబ్బెన/ఆసిఫాబాద్‌/కెరమెరి

● శ్రీరామ నవమిని పురస్కరించుకుని ఆదివారం నిర్వహించే శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవానికి రెబ్బెన మండల కేంద్రంలోని సీతారా మాంజనేయస్వామి ఆలయం, గోలేటి టౌన్‌షిప్‌ లోని శ్రీకోదండ రామాలయాలు ముస్తాబయ్యా యి. రంగు రంగుల విద్యుద్దీపాలతో అందంగా అలంకరించడంతో దేదీప్యమానంగా వెలిగిపోతున్నాయి. నంబాల, తక్కళ్లపల్లి గ్రామాల్లోనూ వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. గోలేటిలోని కోదండ రామాలయంలో వేడుకలకు బెల్లంపల్లి ఏరియా జనరల్‌ మేనేజర్‌ విజయ భాస్కర్‌రెడ్డి హాజరుకానున్నారు. గోలేటి గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో పట్టు వస్త్రాలు, తలంబ్రాలు తీసుకురానున్నారు. పంచాయతీ కార్యాలయం వద్ద ఎదుర్కోలు కార్యక్రమాన్ని చేపట్టిన అనంతరం పట్టువస్త్రాలు సమర్పించేందుకు ఏర్పాట్లు చేశారు. వేలాదిగా తరలివచ్చే భక్తుల కోసం సౌకర్యాలు కల్పించారు. మండల కేంద్రంలోని ప్రధాన రహదారి వెంట ఏర్పాటు చేసిన మైకులతో ప్రత్యేక ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది.

● దహెగాం మండల కేంద్రంతోపాటు లగ్గాం, చినరాస్పెల్లి, కుంచవెల్లి, గిరవెల్లి గ్రామాల్లోని ఆలయాలు శ్రీరామ నవమికి ముస్తాబయ్యాయి. మండల కేంద్రంలోని శివాలయంలో సీతారా ముల కల్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. ఆలయం ఎదుట తాటి ఆకులతో పందిరి, ఆవరణలో టెంట్లు వేశారు. భక్తులు అధిక సంఖ్యలో తరలిరావాలని ఆలయ అర్చకుడు పరమేశ్వర్‌ తెలిపారు.

● జిల్లా కేంద్రంలోని జన్కాపూర్‌ కోదండ రామాల యం శ్రీరామ నవమి వేడుకలకు ముస్తాబైంది. మూడు రోజులుగా ఆలయ ప్రాంగణంలో భూ మి చదును చేసి, షామియానాలు, చలువ పంది ళ్లు వేశారు. ఆలయాన్ని విద్యుద్దీపాలతో అలంకరించారు. జన్కాపూర్‌ నుంచి ఆసిఫాబాద్‌ వరకు రాష్ట్రీయ రహదారి పొడవునా సీతారాముల క ల్యాణ గీతాలు ఆలపించేందుకు మైక్‌లు ఏర్పా టు చేశారు. శనివారం పాల పొరక కార్యక్రమం చేపట్టా రు. ఆదివారం ఉదయం జిల్లా కేంద్రంలోని రాజపేట తుజాల్‌పూర్‌ మురళీఽగౌడ్‌ నివా సం నుంచి రామాలయం వరకు సీతారాముల ఉత్సవ విగ్రహాలతో శోభాయాత్ర నిర్వహించనున్నారు. ఎమ్మెల్యే కోవ లక్ష్మి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. ఉదయం 4 గంటలకు సుప్రభా త సేవ, 4.30 గంటలకు సీతారాములకు అభిషే కం, 9 గంటలకు ఆసిఫాబాద్‌ నుంచి ఆలయం వరకు సీతారాముల ఉత్సవ విగ్రహాలతో హనుమాన్‌ దీక్షాస్వాముల శోభాయాత్ర, 11.59 గంటలకు పునర్వసు నక్షత్రయుక్త అభిజిత్‌ లగ్న సుముహూర్తన సీతారాముల కల్యాణం నిర్వహించున్నారు. అనంతరం అన్నదానం చేపడుతున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.

● కౌటాల మండల కేంద్రంలోని శ్రీకోదండ రామాలయం శ్రీరామనవమి వేడుకలకు ముస్తాబైంది. 36 ఏళ్లుగా కౌటాల రామాలయంలో కల్యాణ మహోత్సవం నిర్వహిస్తున్నారు. ఆదివారం ఉద యం 11.52 గంటలకు శ్రీరామచంద్రస్వామి – సీతామహాదేవి వేద పండితుల సమక్షంలో కల్యా ణం జరిపించనున్నారు. మండల కేంద్రంతోపా టు ఆయా గ్రామాల నుంచి వందలాదిగా భక్తులు తరలిరానున్నారు. మూడు రోజులుగా ఆల య కమిటీ సభ్యులు ప్రచారం చేస్తున్నారు. భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నామని, అధిక సంఖ్యలో తరలిరావాలని ఆలయ కమిటీ అధ్యక్షుడు భట్టమేకల గట్టయ్య తెలిపారు.

● కెరమెరి మండల కేంద్రంలోని శివాలయం సీతారాములు కల్యాణానికి ముస్తాబైంది. ఇప్పటికే ఆలయం ఎదుట టెంట్లు వేశారు. పల్లెర్ల మ ధుకర్‌, గ్రామ పటేల్‌ వాడై సోనేరావు ఆధ్వర్యంలో పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. ఇప్పటి కే సీతమ్మ ఆభరణాలు కొనుగోలు చేశారు. మధ్యాహ్నం 12 గంటలకు కల్యాణం జరపనున్నారు. గ్రామంలో పెళ్లిపత్రికలు పంచిపెట్టారు. మధ్యాహ్నం సీతారాముల ప్రతిమలతో శోభాయాత్ర నిర్వహించనున్నారు.

కౌటాల: విద్యుత్‌ వెలుగుల్లో శ్రీకోదండ రామాలయం

చూతము రారండి1
1/5

చూతము రారండి

చూతము రారండి2
2/5

చూతము రారండి

చూతము రారండి3
3/5

చూతము రారండి

చూతము రారండి4
4/5

చూతము రారండి

చూతము రారండి5
5/5

చూతము రారండి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement