ఆకసం ఆధ్వర్యంలో కవిసమ్మేళనం
ఆసిఫాబాద్: ఉగాది పండుగను పురస్కరించుకుని ఆదివారం రాత్రి ఆసిఫాబాద్ కవుల సంఘం(ఆకసం) ఆధ్వర్యంలో కవి సమ్మేళనం నిర్వహించారు. మంచిర్యాల జిల్లా రాంపూర్ శిశుమందిర్ ప్రధానాచార్యులు రావుల రామన్నకు ఆకసం ఉగాది ఆత్మీయ పురస్కారం ప్ర దానం చేశారు. నవజ్యోతి సాంస్కృతిక సమాఖ్య వ్యవస్థాపకులు దండనాయకుల సురేశ్ కుమార్‌తోపాటు అతిథులను శాలుశాలతో సన్మానించారు. ఈ సందర్భంగా ఆకసం కవుల కవితలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ఆకసం అధ్యక్షుడు నల్లగొండ తిరుపతి, ప్రతినిధులు మాగుడుల నారాయణ మూర్తి, గుర్రాల వెంకటేశ్వర్లు, ఇందారపు మధూకరశర్మ, ధర్మపురి వెంకటేశ్వర్లు, శ్రీరాం సత్యనారాయణ, డిల్లీ విజయ్‌కుమార్, కిల్లి వెంకట్రావు, తాటిపెల్లి జ్యోతి, కాచం సరిత సాయిని శ్రీదేవి, గుర్రాల హరిప్రియ, గంధం శ్రీనివాస్, వాసవీ క్లబ్ అధ్యక్షుడు పాత శ్రీనివాస్, ఆలయ కమిటీ అధ్యక్షుడు రావుల శంకర్ తదితరులు పాల్గొన్నారు.


