‘హైబ్రీడ్‌’ వైపు అడుగులు | - | Sakshi
Sakshi News home page

‘హైబ్రీడ్‌’ వైపు అడుగులు

Published Mon, Apr 14 2025 12:28 AM | Last Updated on Mon, Apr 14 2025 12:28 AM

‘హైబ్

‘హైబ్రీడ్‌’ వైపు అడుగులు

సన్నరకం కంపెనీలకు..

హైబ్రీడ్‌ వరిసాగులో ఎలాంటి అనుభవం లేని రైతులు సైతం మంచి దిగుబడులు సాధించేలా కంపెనీ ప్రతినిధులు అన్ని తామై వ్యవహరిస్తున్నారు. సస్యరక్షణ చర్యలు, యాజమాన్య పద్ధతులు వివరిస్తున్నారు. పంటను విత్తన కంపెనీలే కొనుగోలు చేస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలో సాగవుతున్న హైబ్రీడ్‌ ఆడ వరి ధాన్యానికి రూ.7,500 నుంచి రూ.14వేల వరకు చెల్లిస్తున్నారు. పూత దులిపే పనులు జోరుగా సాగుతున్నాయి. మరో నెల రోజుల్లో పంట దిగుబడి వచ్చే అవకాశం ఉంది. మిగిలిన మగరకం ధాన్యాన్ని(దొడ్డు రకం) రైతులు మార్కెట్‌లో విక్రయించుకోవాలి. దీని ద్వారా వారికి అదనపు ఆదాయం వస్తుంది.

రెబ్బెన(ఆసిఫాబాద్‌): జిల్లా రైతులు యాసంగి సీజన్‌లో హైబ్రీడ్‌ వరిసాగు వైపు దృష్టి సారిస్తున్నారు. పదేళ్లుగా కొందరు రైతులు ఈ రకం వరిసాగుతో లాభాలు సాధిస్తుండగా.. ఈసారి మరికొంత మంది ఆ దిశగా అడుగులు వేశారు. స్థానికంగా నేలలు, వాతావరణం అనుకూలంగా ఉండటంతో విత్తనోత్పత్తి కంపెనీల ప్రతినిధులు జిల్లాకు క్యూ కడుతున్నారు. గతంలో జిల్లాలోని రైతులు యాసంగిలో సాధారణ వరి సాగు చేసేవారు. ప్రధానంగా ఆసిఫాబాద్‌, రెబ్బెన, సిర్పూర్‌, దహెగాం, బెజ్జూర్‌, పెంచికల్‌పేట్‌, చింతలమానెపల్లి మండలాల్లో మాత్రమే వరి సాగు ఉంది. మిగిలిన మండలాల్లో ఎక్కువ మొక్కజొన్న, జొన్న పండిస్తారు. పదేళ్ల క్రితం దహెగాం మండలంలో రైతులు విత్తన వరిసాగు ప్రారంభించారు. ఆ తర్వాత పెంచికల్‌పేట్‌కు ఈ ఏడాది రెబ్బెన మండలానికి సైతం విస్తరించింది. ప్రస్తుతం యాసంగి సీజన్‌లో జిల్లాలో సుమారు 2,500 ఎకరాలకు వివిధ రకాల కంపెనీలకు చెందిన హైబ్రీడ్‌ వరిని రైతులు సాగు చేస్తున్నారు. దహెగాంలో అత్యధికంగా సుమారు 1,800 ఎకరాల వరకు సాగు చేస్తున్నట్లు అంచనా.

కష్టానికి తగినట్లు ఫలితం

సాధారణ రకంతో పోల్చితే హైబ్రీడ్‌ వరి సాగులో కష్టం అధికంగా ఉంటుంది. నారు పోసిన నాటి నుంచి పంట కోత వరకు శ్రమించాల్సిందే. నారు పోసే పద్ధతి నుంచి నాట్లు వేయడం, యాజమాన్య పద్ధతుల్లో ఎంతో తేడా ఉంటుంది. మామూలుగా నారుమడిలో విత్తనాలన్నీ ఒకేచోట చల్లుతారు. కానీ హైబ్రీడ్‌సాగులో మాత్రం నారు మడిలో ఆడ, మగ విత్తనాలు వేర్వేరుగా చల్లాల్సి ఉంటుంది. నాటు సైతం మగ వరి రెండు వరుసల్లో నాటితే ఆడ వరి 8 నుంచి 10 వరకు ప్రత్యేకంగా నాటుకోవాలి. ఇక పొలంలో కలుపు నియంత్రణ, పురుగు మందుల పిచికారీ పనులు సైతం ఎక్కువగా ఉంటాయి. కూలీలపై ఆధారపడాల్సి వస్తుంది. ఆడ, మగ వరి సంకరీరణ చేసి విత్తనాలు పండిస్తారు. ఈ రకం సాగులో మగ మొక్క పుప్పొడి రేణువులు ఆడ మొక్కపై పడేటట్లు చేసే ప్రక్రియ ఎంతో కీలకం. పూత వచ్చే సమయంలో ఈ పుప్పొడి రేణువులను తాడు/కర్రల సహాయంతో దులుపుతారు. ఈ పనులను 12 నుంచి 15 రోజుల వరకు ప్రతిరోజూ ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంటలోపే చేపట్టాలి. అప్పుడే సంపర్కం జరిగి ఆడ వరి దిగుబడి వస్తుంది. పెట్టుబడి, కష్టం అధికంగా ఉన్నా.. ఆదాయం ఆశించిన స్థాయిలో ఉండటంతో రైతులు ఈ రకం వరిసాగుకు మొగ్గు చూపుతున్నారు.

జిల్లాలో పెరిగిన విత్తన వరి సాగు

పంట వేసే ముందే రైతులతో కంపెనీల అగ్రిమెంట్‌

క్వింటాల్‌కు రూ.7500 నుంచి రూ.14000 చెల్లింపు

ఎనిమిదేళ్లుగా సాగు

గతంలో సాధారణ రకం వరి సాగు చేసే వాళ్లం. ఆ డ, మగ వరి సాగులో లా భాలు ఉంటాయని తెలుసుకుని ఎనిమిదేళ్ల క్రితం ఈ సాగు ప్రారంభించాం. మొదటి ఏడాదే లాభాలు వచ్చాయి. ఈ సీజన్‌లో 15 ఎకరాల్లో సీడ్‌ పండిస్తున్నా. ఎకరానికి 15 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుందని అనుకుంటున్నా. – కొండు సంతోష్‌

అగ్రిమెంట్‌ చేసుకోవాలి

హైబ్రీడ్‌ వరిసాగులో లాభాలు ఉంటాయి. అయితే సాధారణ సాగుతో పోల్చితే రిస్క్‌, పని రెండూ ఎక్కువే. హైబ్రీడ్‌ ఆడ వరి ధాన్యాన్ని విత్తనం ఇచ్చిన కంపెనీనే కొనుగోలు చేస్తుంది. రైతులు ముందుగా కంపెనీతో అగ్రిమెంట్‌ తప్పనిసరిగా చేసుకోవాలి.

– శ్రీనివాసరావు, జిల్లా వ్యవసాయాధికారి

‘హైబ్రీడ్‌’ వైపు అడుగులు1
1/2

‘హైబ్రీడ్‌’ వైపు అడుగులు

‘హైబ్రీడ్‌’ వైపు అడుగులు2
2/2

‘హైబ్రీడ్‌’ వైపు అడుగులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement