
నేడు ‘అసర్’ పరీక్ష
● ఆసిఫాబాద్, వాంకిడి, కెరమెరి మండలాల్లో సర్వే ● జిల్లాలో 72 పాఠశాలలు ఎంపిక ● హాజరు కానున్న 3, 4, 5వ తరగతుల విద్యార్థులు
కెరమెరి(ఆసిఫాబాద్): గతంలో నిర్వహించిన నేషనల్ అచీవ్‌మెంట్ సర్వే(న్యాస్) ఆధారంగా జిల్లాలో అనేక పాఠశాలల విద్యార్థులు చదవడంతోపాటు చ తుర్విద ప్రక్రియల్లో ఏ స్థాయిలో ఉన్నారో తేలింది. ప్రస్తుతం పరిస్థితిలో ఏమైనా మార్పు వచ్చిందా.. కనీస సామార్థ్యాలతోపాటు చతుర్విద ప్రక్రియల్లో మెరుగుపడ్డారా.. తదితర విషయాలు తెలుసుకునేందుకు నీతి ఆయోగ్ పిరమిల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సోమవారం అన్వల్ నేషనల్ ఎండ్‌లైన్ రిపోర్ట్(అసర్) సర్వే(పరీక్ష) నిర్వహించనున్నారు. జిల్లాలో ఆసిఫాబాద్, వాంకిడి, కెరమెరి మండలా ల్లో ఎంపిక చేసిన 72 పాఠశాలల్లో నేడు పరీక్ష జరగనుంది. ఇందుకోసం విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు. ఎంఈవోలు, ప్రధానోపాధ్యాయులు, సీఆర్‌పీలు, ఎంఐఎస్ కోఆర్డినేటర్, సీసీవోలకు జూమ్ మీటింగ్ నిర్వహించి పరీక్ష విధానంపై అవగాహన కల్పించారు.
30 శాతం మంది విద్యార్థులకు..
మూడు మండలాల్లో ఎంపిక చేసిన పాఠశాలల్లో 3, 4, 5వ తరగతులు చదువుతున్న విద్యార్థులు అసర్ పరీక్ష రాయనున్నారు. పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య ఆధారంగా కేవలం 30 మందిని మాత్రమే ఎంపిక చేశారు. ర్యాండమ్‌గా పిల్లలను ఎంపిక చేస్తామ ని అధికారులు తెలిపారు. అంటే.. ఒక పాఠశాలలో పది మంది ఉంటే ముగ్గురు మాత్రమే పరీక్షలు రాయనున్నారు. తెలుగు, గణితం సబ్జెక్టులో పరీక్ష కొనసాగనుంది. అన్ని తరగతులకు ఒకే రకమైన ప్ర శ్నపత్రం ఉంటుంది. తెలుగులో పదాలు, రెండు అక్షరాల పదాలు, సరళ పదాలు, వాక్యాలు గుర్తించాలి. గణితంలో అంకెలు, సంఖ్యలు, తీసివేత, భా గాహారం చేయాల్సి ఉంటుంది. ఒక్కో విభాగంలో విద్యార్థి రాణిస్తున్నాడు.. అనే విషయాన్ని పరిగణనలోకి తీసుకుంటారు. 20 నిమిషాల సమయం కేటాయిస్తారు. అనుమానాలు నివృత్తి చేసేందుకు సీఆర్‌పీ, ఎంఐఎస్, సీసీవోలు ఉంటారు. ఎంఈవోలు నోడల్ అధికారులుగా వ్యవహరిస్తారు.
ఏర్పాట్లు చేశాం
అసర్ పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేశాం. ఇప్పటికే ఆయా పాఠశాల హెచ్‌ఎంలతో పాటు ఎంఈవోలు, ఎంఆర్‌సీ, సీఆర్‌సీ సిబ్బందికి అవగాహన కల్పించాం. కనీస సామార్థ్యాలు తెలుసుకునేందుకు ఈ సర్వే ఉపయోగపడుతుంది. దేశంలో కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ఏ స్థానంలో ఉందో ఈ పరీక్ష ద్వారా తెలుస్తుంది. ఎంపిక చేసిన పాఠశాలల్లో తప్పకుండా ఈ పరీక్షలు నిర్వహించాలి.
– ఉప్పులేటి శ్రీనివాస్, క్వాలిటీ కోఆర్డినేటర్, విద్యాశాఖ

నేడు ‘అసర్’ పరీక్ష