
ఘనంగా అశోక చక్రవర్తి జయంతి
వాంకిడి(ఆసిఫాబాద్): మండల కేంద్రంలోని జేత్వాన్ బుద్ధ విహార్‌లో శనివారం సామ్రాట్ అశోక చక్రవర్తి జయంతి ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పలువు రు వక్తలు మాట్లాడుతూ కలింగ యుద్ధానంతరం సామ్రాట్ అశోక చక్రవర్తి ప్రపంచానికి శాంతి మార్గం చూపించారని తెలిపారు. ప్రజల కోసం సేవా కార్యక్రమాలు నిర్వహించారని, 84 వేల బౌద్ధ విహారాల్లో శిలా శాసనాలు చెక్కించారని గుర్తు చేశారు. కార్యక్రమంలో బీఎస్‌ఐ జిల్లా అధ్యక్షుడు అశోక మహోల్కర్, అంబేడ్కర్ యువజన సంఘం ప్రధాన కార్యదర్శి సునీల్‌కుమార్, నాయకులు జైరాం, ప్రతాప్, రోషన్, విజయ్, మనో జ్, ప్రశాంత్, విఠల్, రమేశ్ పాల్గొన్నారు.