
ఈజీ మనీ.. ఆన్‌లైన్ ఆటలు!
చైన్‌మార్కెటింగ్‌తోనూ
ఇంట్లోనే ఉంటూ డబ్బులు సంపాదించవచ్చు, తమ ఉత్పత్తులను ప్రచారం చేసి పైసలు కూడబెట్టవచ్చంటూ చేసే ప్రచారంతో నష్టపోతున్నారు. చైన్, ఆన్‌లైన్ మార్కెటింగ్ తదితర వాటితోనూ దెబ్బతింటున్నారు. ఒకరిని చేర్పించి, మరొకరిని చేర్పిస్తే డబ్బులు వస్తాయంటూ ఆశ చూపుతున్నారు. మొదట కొందరికి డబ్బులు వచ్చేలా చేసి ఆ తర్వాత చేతులెత్తేస్తున్నారు. అప్పట్లో మంచిర్యాలలో ఓ వ్యాపారి వందలాది మందిని చైన్ మార్కెటింగ్‌లో వాట్సాప్ గ్రూపుగా ఏర్పాటు చేసి రూ.లక్షల్లో కట్టాక ఆ డబ్బులు సైతం రాకపోయే సరికి అందరూ కలిసి ఆయనపై కేసు పెట్టారు. ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో ఈ బాధితులు ఎక్కువగా ఉన్నారు. ఇటీవల కాగజ్‌నగర్‌లో మహిళలకే రుణాలు అంటూ ప్రచారం చేసి డబ్బులు వసూలు చేసి పరారయ్యారు.
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ఈజీ మనీ.. సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతో చాలామంది ఆర్థికంగా నష్టపోతున్నారు. ఆన్‌లైన్ వేదికగా సాగుతున్న కార్యకలాపాల్లో రూ.లక్షలు పోగోట్టుకుంటున్నారు. ఉద్యోగులు, వ్యాపారులు, యువత, విద్యార్థులు స్మార్ట్‌ఫోన్లలో అనేక రూపాల్లో పెట్టుబడులు పెడుతున్నారు. చాలామందికి ఇవి నష్టాలే తెస్తు న్నా.. సోషల్ మీడియాలో వస్తున్న ప్రకటనలతో వేలాది మంది ఆకర్షితులు అవుతున్నారు. ఇలాంటి ప్రకటనలు, ఆన్‌ౖలైన్ మోసాల బారిన పడొద్దని పోలీసులు సూచిస్తున్నారు.
బెట్టింగ్ యాప్‌లు
బెట్టింగ్ మోజులో పడి చాలామంది యువత తమ భవిష్యత్‌ను పాడు చేసుకుంటున్నారు. మంచిర్యాలతోపాటు కాగజ్‌నగర్, బెల్లంపల్లి, ఆసిఫాబాద్ వంటి గిరిజన ప్రాంతాల్లోనూ అనేకమంది ఐపీఎల్ క్రికె ట్ మ్యాచ్‌ల్లో బెట్టింగ్ పెడతున్నారు. కాగజ్‌నగర్‌లో కొందరు సట్టా, మట్కా ఆడిస్తూ డబ్బులు అధికంగా సంపాదించవచ్చని చెబుతూ ఊబిలోకి దింపుతున్నారు. మహారాష్ట్రలో కళ్యాణ్, ముంబయితోపాటు నగరాల కేంద్రంగా నడిచే సట్టా, మట్కాలో సింగిల్, డబుల్.. అంటూ రూ.10కి వంద, వెయ్యి, పది వేలు దాక లాభం ఉంటుందని ప్రచారం చేస్తున్నారు. పలానా నంబర్ వస్తే మీకు లక్ కలిసి వస్తుందని చెబుతూ రూ.లక్షలు వసూళ్లు చేస్తున్నారు. ఇటీవల కాగజ్‌నగర్‌కు చెందిన నలుగురు యువకులు మట్కా కేసులో హైదరాబాద్‌లో పట్టుబడ్డారు.
ఆన్‌లైన్ యాప్స్, గేమ్స్
ఆన్‌లైన్‌లో గేమ్స్ ఆడితే డబ్బులు వస్తాయంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంతోనూ అనేక మంది స్మార్ట్‌ఫోన్లలో ఆడుతున్నారు. రమ్మీతోపాటు పలు గేమ్స్ డబ్బులు పెట్టి ఆడుతున్నారు. విద్యార్థులతోపాటు ఉద్యోగస్తులు ఆర్థికంగా నష్టపోతున్నారు. పలు యాప్‌లతోనూ ఆన్‌లైన్‌లోనే లావాదేవీలు జరుపుతున్నారు. మందమర్రికి చెందిన ఓ పేకాట వ్యసనపరుడు ఆన్‌లైన్‌లో రమ్మీ ఆడుతూ రూ.లక్షలు పోగొట్టుకున్నాడు. మంచిర్యాల కేంద్రంగా ఓ యాప్ పేరుతో సభ్యులను చేర్పిస్తూ డబ్బులు వసూలు చేశారు. రిజిస్ట్రేషన్లు చేసి, వందలాది మందితో ఆ యాప్ డౌన్‌లోడ్ చేయించారు. డబ్బులు జ మ చేశాక కొందరికి మాత్రమే లాభాలు వచ్చి మిగతా వారు మోసపోయామని బాధపడ్డారు.
బయటకు చెప్పుకోలేక..
ఆన్‌లైన్ మోసాల బాధితులు చాలామంది బయటకు చెప్పుకోలేకపోతున్నారు. సైబర్ నేరాల్లో మా త్రమే కేసులు నమోదవుతున్నాయి. తెలిసి పెట్టుబ డి పెట్టి కోల్పోయిన ఘటనల్లో బయటకు రావడం లేదు. ఇటీవల ఆర్కేపీకి చెందిన ఓ వ్యక్తి ఆన్‌లైన్‌లో పెట్టుబడులు పెట్టి ప్రకటనలో చూపించినట్లుగా రాలేదని నిర్వాహకులను అడిగితే అక్కడి నుంచి స మాధానం రాలేదు. ఉద్యోగిగా సమాజంలో ఇబ్బందిగా మారుతుందని ఆయన ఎక్కడా ఫిర్యాదు కూడా ఇవ్వలేదు.
సులువుగా డబ్బు సంపాదనపై ఆశ
బెట్టింగ్‌లు, గేమ్స్, యాప్‌లకు ఆకర్షణ
రూ.లక్షలు కోల్పోతున్న బాధితులు
మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల్లో ఘటనలు

ఈజీ మనీ.. ఆన్‌లైన్ ఆటలు!

ఈజీ మనీ.. ఆన్‌లైన్ ఆటలు!