
జగ్జీవన్‌రామ్ జీవితం ఆదర్శప్రాయం
● కలెక్టర్ వెంకటేశ్ దోత్రే
ఆసిఫాబాద్‌అర్బన్: స్వాతంత్య్ర సమరయోధులు, సంఘ సంస్కర్త, మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్‌రామ్ జీవితం ఆదర్శప్రాయమని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఆవరణలో శనివారం షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో జగ్జీవన్‌రామ్ జయంతి ఘనంగా నిర్వహించారు. అదనపు కలెక్టర్లు దీపక్ తివారి, డేవిడ్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ సజీవన్, ఆర్డీవో లోకేశ్వర్‌రావు, వివిధ సంఘాల నాయకులతో కలిసి పూలమాలలు వేసి నివాలర్పించారు. కలెక్టర్ మాట్లాడు తూ జగ్జీవన్‌రామ్ అణగారిన వర్గాల కోసం పోరాడి న మహోన్నత వ్యక్తి అని కొనియాడారు. రాజ్యాంగ సభ సభ్యుడి, వివిధ శాఖల మంత్రిగా, ఉప ప్రధానిగా సేవలందించారని గుర్తు చేశారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి భాస్కర్, విద్యుత్ శాఖ అధికారి శేషారావు, ఎమ్మార్పీఎస్ నాయకులు రేగుంట కేశవ్‌రావు, సింగిల్ విండో చైర్మన్ అలీబిన్ అహ్మద్, డీసీసీ అధ్యక్షుడు విశ్వప్రసాద్‌రావు, మాజీ ఎంపీపీ అరిగెల మల్లికార్జున్, కుల సంఘాల నాయకులు మాటూరి జయరాజ్, రూప్‌నార్ రమేశ్, గంగుబాయి. బ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు.