
సంక్షేమ పథకాలు వినియోగించుకోవాలి
పెంచికల్‌పేట్(సిర్పూర్): అర్హులు సంక్షేమ పథకాలను వినియోగించుకోవాలని కాగజ్‌నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా అన్నారు. మండలంలోని లోడుపల్లి గ్రామంలో బుధవారం సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. సబ్ కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలకు అర్హులను ఎంపిక చేయడంలో క్షేత్రస్థాయిలో అధికారులు కృషి చేయాలన్నారు. అర్హులైన వారికి పథకాలు అందేలా చూడాలని ఆదేశించారు. కార్యక్రమంలో తహసీల్దార్ వెంకటేశ్వర్‌రావు, ఎస్సై కొమురయ్య, పంచాయతీ కార్యదర్శి శ్రీధర్, గ్రామస్తులు పాల్గొన్నారు.
సిర్పూర్(టి) మండలంలో..
సిర్పూర్(టి): సిర్పూర్(టి) గ్రామ పంచాయతీ పరిధిలోని పేట్‌మహెలా కాలనీ, గోవింద్‌పూర్ కాలనీలోని రేషన్ దుకాణాల్లో బుధవారం ఎ మ్మెల్సీ దండె విఠల్, కాగజ్‌నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా సన్నబియ్యం పంపిణీని ప్రారంభించారు. లబ్ధిదారులు సన్నబియ్యాన్ని సద్విని యోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీవో సత్యనారాయణ, పంచాయతీ కార్యదర్శి తిరుపతి పాల్గొన్నారు.