అప్రమత్తంగా ఉండాలి
ఇళ్లకు తాళాలు వేసి ఎక్కువ రోజులు శుభకార్యాలు, ఇతర పనులకు వెళ్తే దొంగలు పడే ప్రమాదం ఉంటుంది. అలాంటి సమయంలో అప్రమత్తంగా ఉంటూ స్థానికులు, పోలీసులకు సమాచారం అందించాలి. ఇంటి ఎదుట సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే స్థానిక పోలీస్ స్టేషన్‌కుసమాచారం ఇవ్వడంతో పాటు డయల్ 100కు కాల్ చేయాలి.
– రామానుజం,
డీఎస్పీ, కాగజ్‌నగర్
కౌటాల(సిర్పూర్): ఇళ్లు, ఆలయాలు, దుకాణాలు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు.. ఇవీ సాధారణంగా దొంగల టార్గెట్లు. కానీ ఇప్పుడు వారు రూటు మార్చా రు. ఇంటి బయట ఒంటరిగా ఉన్న మహిళలనే లక్ష్యంగా చేసుకుని ఆభరాణాలు లాక్కొని వెళ్తున్నా రు. వరుస దొంగతనాలు జిల్లావాసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఏ మాత్రం ఏమరుపాటుగా ఉన్నా కష్టించి కూడబెట్టిన సొమ్మును కాజేస్తున్నారు. వేసవి ప్రారంభానికి ముందే దొంగలు చోరీలకు తెగబడుతుండం ఆందోళన కలిగిస్తోంది. వేసవి సెలవుల్లో ఇళ్లకు తాళాలు వేసి వెళ్తే మరింత రెచ్చిపోయే అవకాశం కన్పిస్తోంది. పట్టపగలే దోపిడీలకు పాల్పడుతుండటం కూడా కలకలం రేపుతోంది. దుండగులు పగలు కాలనీల్లో రెక్కీ నిర్వహిస్తూ తాళం వేసిన ఇళ్లను ఏ మాత్రం ఆలస్యం చేయకుండా దోచుకుంటున్నారు. దొంగలను పట్టుకుని సొమ్ము రికవరీ చేయడంలో పోలీసులు విఫలమవుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
పోలీసుల అవతారం ఎత్తుతూ..
దొంగతనాల కోసం దుండగులు పోలీసుల అవతారం ఎత్తుతున్నారు. రహదారులపై వాహనాల కోసం ఎదురుచూస్తున్న వారి వద్దకు మాస్కులు, హెల్మెట్లు ధరించి వెళ్లి పోలీసులమని చెబుతూ నగదు, నగలు తీసుకుని బురిడీ కొట్టిస్తున్నారు. అమాయకులు నకిలీ పోలీసులను నమ్మి మోసపోతున్నారు. ఇటీవల గుర్తు తెలియని వ్యక్తులు పోలీసులమని చెప్పి ఆసిఫాబాద్ మండలం మానిక్‌గూడ వద్ద మహిళ నుంచి బంగారు ఆభరణాలు, సిర్పూర్(టి) మండల కేంద్రానికి చెందిన వ్యక్తి వద్ద నుంచి నగదు దోచుకున్నారు. అలాగే కొందరు వాహనాల తనిఖీల పేరిట అమాయకుల వద్ద అందిన కాడికి దోచుకుంటున్నారు. పార్కింగ్ చేసిన బైక్‌లను సైతం వదలడం లేదు. జిల్లాకు ఆనుకుని మహారాష్ట్ర ఉండడంతో దొంగలు పోలీసులకు చిక్కకుండా సరిహద్దు దాటుతున్నారు.
నిత్యం చోరీలు
జిల్లాలో నిత్యం ఎక్కడో ఓచోట చోరీలు జరుగుతూనే ఉన్నాయి. చాలా ఘటనలు వెలుగులోకి రావడం లేదు. ఏటా జిల్లాలో వందకు పైగా దొంగతనాలు నమోదవుతున్నాయి. ఇటీవల కాగజ్‌నగర్, ఆసిఫాబాద్ పట్టణాల్లో చోరీలు పెరిగాయి. రెబ్బెన, వాంకిడి, చింతలమానెపల్లి, సిర్పూర్(టి), పెంచికల్‌పేట్, కౌటాల మండలాల్లో ఘటనలు తరుచూ చోటు చేసుకుంటున్నాయి. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినా చాకచాక్యంగా తప్పించుకుంటున్నారు.
చోరీల వివరాలు
సంవత్సరం దొంగతనాలు
2023 104
2024 78
● రూటుమార్చిన కేటుగాళ్లు.. ● మహిళలే లక్ష్యంగా దొంగతనాలు
● రూటుమార్చిన కేటుగాళ్లు.. ● మహిళలే లక్ష్యంగా దొంగతనాలు


