
ప్రశాంతంగా అసర్ పరీక్షలు
కెరమెరి(ఆసిఫాబాద్): ఆసిఫాబాద్, వాంకిడి, కెరమెరి మండలాల్లోని 72 ప్రభుత్వ పాఠశాలల్లో సోమవారం అన్వల్ నేషనల్ ఎండ్‌లైన్ రిపోర్ట్(అసర్) పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించారు. నీతి ఆయోగ్ పిరమిల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పరీక్షకు మొత్తం 916 మంది విద్యార్థులు హాజరయ్యారు. 285 మంది 3వ తరగతి విద్యార్థులు, 315 మంది 4వ తరగతి, 316 మంది 5వ తగరతి విద్యార్థులు తెలుగు, ఆంగ్లం, గణితం పరీక్షలు రాశారు. ఆయా పాఠశాలల్లో సుమారు 85 మంది ఉపాధ్యాయులు సర్వేలో పాల్గొనగా, సీఆ ర్‌పీలు, ఎంఐఎస్ కోఆర్డినేటర్, సీసీవోలు పర్యవేక్షించారు. నీతి ఆయోగ్ ప్రతినిధులు జిల్లాలోని పలు పాఠశాలలో కొనసాగిన అసర్ సర్వేను పరిశీలించారు. విద్యార్థుల ప్రగతిని తెలుసుకున్నారు.