రాంజీగోండుకు ఘన నివాళి
ఆసిఫాబాద్‌అర్బన్: స్వాతంత్య్ర పోరాట యో ధుడు, ఆదివాసీ ముద్దుబిడ్డ మర్సుకోల రాంజీగోండు వర్ధంతిని జిల్లా కేంద్రంలో తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఆ సంఘం జిల్లా అధ్యక్షురాలు మాలశ్రీ మాట్లాడుతూ స్వాతంత్య్రం కోసం జరిగిన తొలితరం ఉద్యమంలో అనేక మంది ఆదివాసీలు బ్రిటీష్ పాలకులకు వ్యతిరేకంగా పోరాడారని తెలిపా రు. ప్రస్తుతం ఏజెన్సీలోని సహజ సంపద, ఖనిజ వనరులను బహుళజాతి కంపెనీలకు దొడ్డిదారిలో దోచిపెడుతున్నారని ఆరోపించారు. జిల్లా ఉపాధ్యక్షులు శ్రీనివాస్, డీవైఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు టీకానంద్, నాయకులు నైతం రాజు, శ్రావణి తదితరులు పాల్గొన్నారు.


