
చదువుతోనే సమాజంలో గుర్తింపు
బెజ్జూర్: చదువుతోనే సమాజంలో గుర్తింపు ఉంటుందని రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత సుందిళ్ల రమేశ్ పేర్కొన్నారు. మండలంలోని తలాయి గ్రామంలో శుక్రవారం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించి ఆయన మాట్లాడారు. యువత చదువులో ముందుండాలని, చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. బాల్య వివాహాలను అరికట్టాలని, బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించాలని తెలిపారు. మద్యం, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని పేర్కొన్నారు. ఆరోగ్య నియమాలు పాటించాలని తెలిపారు. ఓటు హక్కుపై అవగాహన కలిగి ఉండాలని పేర్కొన్నారు. వన్యప్రాణులను సంరక్షించుకోవడం అందరి బాధ్యత అని తెలిపారు. మూఢనమ్మకాలు వీడాలని సూచించారు. మహనీయుల అడుగుజాడల్లో యువత నడుస్తూ చదువులో రాణించి ఎదగాలని ఆకాంక్షించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలతోపాటు 12 అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. అంతకుముందు గ్రామంలో మహిళలతో అక్షరాలు దిద్దించారు.