
రోడ్డు పనులు అడ్డగింత
చింతలమానెపల్లి: మండలంలోని బూరెపల్లిలో సిమెంటు రోడ్డు పనులను గురువారం అటవీశాఖ అధికారులు అడ్డుకున్నారు. ఉపాధిహామీ పథకం కింద హనుమాన్ ఆలయం వరకు రూ.5లక్షల నిధులతో పనులు ప్రారంభించారు. మూడు రోజులుగా కొనసాగుతుండగా గురువారం డీఆర్‌వో హైమావతి, సెక్షన్ అధికారులు సూర్యారావు, మోహన్, సిబ్బంది అడ్డుకున్నారు. సామగ్రిని స్వాధీనం చేసుకుని కార్యాలయానికి తరలించారు. పనులు నిర్వహిస్తున్న స్థలం రిజర్వ్ అటవీభూమి పరిధిలోకి వస్తుందని, అనుమతులు లేనందున పనులు నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. అయితే పనులు అడ్డుకోవడంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు.