
పూలే జయంతి ఘనంగా నిర్వహించాలి
ఆసిఫాబాద్‌అర్బన్: మహాత్మా జ్యోతిబా పూలే జయంతిని ఘనంగా నిర్వహించాలని అఖిల భారతీయ మాలి మహాసంఘం నాయకులు కోరారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలో సోమవారం కలెక్టర్ వెంకటేశ్ దోత్రేకు వినతిపత్రం అందించారు. ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు గుర్నులె మెంగాజీ మాట్లాడుతూ మాలి కులస్తులు ఏళ్లుగా పూలే వర్ధంతి, జయంతి కార్యక్రమాలు నిర్వహిస్తుండగా, 2008 నుంచి ప్రభుత్వం కూడా అధికారికంగా జయంతి నిర్వహిస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకు కేటాయించిన నిధులతోపాటు కలెక్టర్ కూడా రూ.లక్ష అదనంగా కేటాయిస్తున్నారని తెలిపారు. ఈ ఏడాది కూడా లోటుపాట్లు లేకుండా జయంతి ఘనంగా నిర్వహించాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు నాగోసె శంకర్ తదితరులు పాల్గొన్నారు.