
కొవ్వొత్తులతో నివాళి
ఆసిఫాబాద్: కశ్మీర్‌లోని పహల్గాం సమీపంలో జరిగిన దారుణమైన ఉగ్ర దాడిని నిరసిస్తూ, ఈ దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళిగా బుధవారం రాత్రి బజరంగ్‌దళ్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని వివేకానంద చౌక్ నుంచి కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. టూరిస్టులపై విచక్షణారహితంగా దాడి చేసి హతమార్చడాన్ని తీవ్రంగా ఖండించారు. నాయకులు మాట్లాడుతూ హిందువులపై దాడికి పాల్పడిన ముష్కరులకు తగిన గుణపాఠం చెప్పాలన్నారు. బీజేపీ నాయకులు అరిగెల మల్లికార్జున్, బజరంగ్‌దళ్, జాగో హిందూ జాగో, ఆర్‌ఎస్‌స్, హిందూ సంఘాల నాయకులు పాల్గొన్నారు.