బాలికలదే హవా | - | Sakshi
Sakshi News home page

బాలికలదే హవా

Published Wed, Apr 23 2025 8:01 AM | Last Updated on Wed, Apr 23 2025 9:01 AM

● బాలురలతో పోల్చితే ఉత్తమ ఫలితాలు సాధించిన వైనం ● రాష్ట్రస్థాయిలోనూ మెరుగుపడిన జిల్లా ర్యాంకు ● సెకండియర్‌లో 2, ఫస్టియర్‌లో 4వ స్థానం..

ఆసిఫాబాద్‌రూరల్‌: ఇంటర్మీడియెట్‌ ఫలితాల్లో మ రోసారి బాలికలు మెరిశారు. బాలురలతో పోలిస్తే ఎక్కువ మంది ఉత్తీర్ణత సాధించారు. రాష్ట్రస్థాయిలో కూడా కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లా స్థానం గతేడాదితో పోలిస్తే మెరుగుపడింది. కేజీబీ వీలు, గురుకులాలు, ప్రభుత్వ కళాశాలలు మెరుగైన ఉత్తీర్ణత శాతం నమోదు చేశాయి. తిర్యాణి ప్రభుత్వ జూనియర్‌ కళాశాలకు చెందిన బైపీసీ సెకండియర్‌ విద్యార్థి గున్నాల పూజిత 1000 మార్కులకు 990 మార్కులతో రాష్ట్రస్థాయి ర్యాంకు సాధించింది.

ఫలితాలు ఇలా..

మంగళవారం విడుదలైన ఇంటర్‌ ఫలితాల్లో సెకండియర్‌లో జిల్లా రెండో స్థానంలో నిలవగా, ఫస్టియర్‌ ఫలితాల్లో నాలుగో స్థానంలో నిలిచింది. కొన్నేళ్లుగా జిల్లా రెండు, మూడు స్థానాల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. అయితే గతేడాది మాత్రం ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో 7, ప్రథమ సంవత్సరం ఫలితాల్లో 8వ స్థానంలో నిలిచింది. 2024– 25 విద్యాసంవత్సరంలో ఫస్టియర్‌ జనరల్‌ విభాగంలో 3,995 మంది విద్యార్థులు హాజరు కాగా, 2,816(70.49శాతం) మంది ఉత్తీర్ణత సాధించారు. ఒకేషనల్‌ విభాగంలో 761 మంది విద్యార్థులకు 538(70.70శాతం) మంది పాసయ్యారు. ద్వితీయ సంవత్సరం జనరల్‌ విభాగంలో 4,199 మంది విద్యార్థులు హాజరు కాగా, 3,339(79.52శాతం) మంది ఉత్తీర్ణత సాధించారు. ఒకేషనల్‌ విభాగంలో 721 మందికి 609(84.47) మంది ఉత్తీర్ణులయ్యారు. ఈ ఏడాది కూడా బాలురులతో పోల్చితే బాలికలే ఎక్కువ మంది పాసయ్యారు. ఫస్టియర్‌లో జనరల్‌, ఒకేషనల్‌ విభాగాల్లో 2,133 మంది బాలురులు పరీక్షలు రాయగా, 1,255 మంది ఉత్తీర్ణత సాధించారు. బాలికలు 2,623 మంది హాజరు కాగా, 2,099 మంది పాసయ్యారు. ఇక సెకండియర్‌లో 2,212 మంది బాలురులకు 1,564 మంది ఉత్తీర్ణులు కాగా, బాలికలు 2,708 మందికి 2384 మంది పాసయ్యారు.

సత్తా చాటిన ‘ప్రభుత్వ’ విద్యార్థులు

జిల్లా కేంద్రంలోని తెలంగాణ మోడల్‌ స్కూల్‌ విద్యార్థులు ఇంటర్‌ ఫలితాల్లో సత్తా చాటినట్లు ప్రిన్సిపాల్‌ మహేశ్వర్‌ తెలిపారు. ఫస్టియర్‌లో 157 మందికి 120 మంది, సెకండియర్‌లో 157 మందికి 156 మంది ఉత్తీర్ణులయ్యారు. ద్వితీయ సంవత్సరం ఎంపీసీ గ్రూపులో అదిబా తహిరీం 1000 మార్కులకు 971, హర్షిత 970, సమత 964, సౌమ్య 934, బైపీసీలో విద్య 968, సీఈసీలో సాహిత్య 932, ఎంఈసీలో శ్రీవిద్య 859 మార్కులు సాధించారు. ఇక ఫస్టియర్‌ ఎంపీసీ గ్రూపులో సైరి బాను 470 మార్కులకు 445, బైపీసీలో వైష్ణవి 440 మార్కులకు 425, సీఈసీలో చందన 500 మార్కులకు 478, ఎంఈసీలో వైష్ణవి 500 మార్కులకు 435 మార్కులు సాధించారు. జిల్లా కేంద్రంలో బాలికల గురుకుల కళాశాలలో ఫస్టియర్‌ విద్యార్థులు 124 మందికి 115 మంది(93 శాతం) ఉత్తీర్ణులు కాగా, సెకండియర్‌లో 108 మంది 108 మంది(వందశాతం), యూఆర్‌జేసీలో ఫస్టియర్‌ విద్యార్థులు 65 మందికి 62(95 శాతం), సెకండియర్‌లో 63 మందికి 61 మంది(97 శాతం) ఉత్తీర్ణత సాధించారు. ఆసిఫాబాద్‌లోని మహాత్మా జ్యోతిబా పూలే కళాశాలకు చెందిన ఎంపీసీ ఫస్టియర్‌ విద్యార్థిని అశ్విని 447, సెకండియర్‌ బైపీసీ విద్యార్థిని అంజలి 970 మార్కులు సాధించారు.

బాలికలదే హవా1
1/8

బాలికలదే హవా

బాలికలదే హవా2
2/8

బాలికలదే హవా

బాలికలదే హవా3
3/8

బాలికలదే హవా

బాలికలదే హవా4
4/8

బాలికలదే హవా

బాలికలదే హవా5
5/8

బాలికలదే హవా

బాలికలదే హవా6
6/8

బాలికలదే హవా

బాలికలదే హవా7
7/8

బాలికలదే హవా

బాలికలదే హవా8
8/8

బాలికలదే హవా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement