
సమ్మె కాలపు ఒప్పందాలు అమలు చేయాలి
రెబ్బెన: గోలేటిలో పనిచేస్తున్న కోల్ ట్రాన్స్‌పోర్ట్ డ్రైవర్లు, క్లీనర్లకు సమ్మె కాలపు ఒప్పందాలు అమలు చేయాలని ఏఐటీయూసీ బె ల్లంపల్లి రీజియన్ అధ్యక్షుడు బోగే ఉపేందర్ డిమాండ్ చేశారు. శుక్రవారం కోల్ ట్రాన్స్‌పో ర్టు కార్మికులు విధులు బహిష్కరించి రాస్తారోకో చేపట్టారు. ఆయన మాట్లాడుతూ కోల్ ట్రాన్స్‌పోర్ట్ యాజమాన్యం, యూనియన్ మధ్య జరిగిన అగ్రిమెంట్ ప్రకారం ప్రతినెలా 15లోగా వేతనాలు చెల్లించాలని, ఈఎస్‌ఐ, పీఎఫ్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశా రు. కోల్ ట్రాన్స్‌పోర్టు వర్కర్స్ యూనియన్ గోలేటి బ్రాంచి అధ్యక్షుడు స్వామి, కార్యదర్శి లక్ష్మీనారాయణ, నాయకులు తిరుపతి, సంతోష్, చందర్‌లాల్, సతీశ్ పాల్గొన్నారు.