
సమ్మర్ సెలవులొచ్చాయ్..
పాఠశాలలకు వేసవి సెలవులు వచ్చాయి. ఈ నెల 9 నుంచి ప్రారంభమైన సమ్మెటీవ్ అసెస్మెంట్ పరీక్షలు 17 వరకు కొనసాగాయి. చివరిరోజు బుధవారం తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించారు. అనంతరం 1 నుంచి 9వ తరగతి విద్యార్థులకు ప్రోగ్రెస్ కార్డులు ప్రదానం చేశారు. వసతిగృహాల్లోని విద్యార్థులు తల్లిదండ్రులతో కలిసి ఇంటిబాట పట్టారు. ఆసిఫాబాద్, కాగజ్‌నగర్ బస్టాండ్లు రద్దీగా మారాయి. ఈ నెల 13 నుంచి జూన్ 11 వరకు ప్రభుత్వం పాఠశాలలకు సెలవులు ప్రకటించింది. తిరిగి జూన్ 12న పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. – ఆసిఫాబాద్‌రూరల్

సమ్మర్ సెలవులొచ్చాయ్..

సమ్మర్ సెలవులొచ్చాయ్..