
బాల్యవివాహాలు చేస్తే కఠిన చర్యలు
ఆసిఫాబాద్‌రూరల్: బాల్యవివాహాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రోహిత్ దేశ్‌పాండే అన్నారు. ముందస్తు సమాచారం మేరకు ఆసిఫాబాద్ మండలం గుండి గ్రామంలో జిల్లా బాలల పరిరక్షణ విభాగం అధికారులతో కలిసి మంగళవారం బాల్య వివాహాన్ని అడ్డుకున్నారు. బంధువులు, తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చి బాలికను సఖి కేంద్రానికి తరలించారు. ఆయన మాట్లాడుతూ.. బాల్యవివాహాలు చేయడం నేరామన్నారు. మైనర్ల పెళ్లిలను ప్రోత్సహిస్తే ఇరువైపులా కుటుంబ సభ్యులు, పురోహితులపైనా నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేసి, రెండేళ్ల జైలు, రూ.లక్ష జరి మానా విధిస్తారని తెలిపారు. బాలికల భవి ష్యత్తును దృష్టిలో ఉంచుకుని 18 ఏళ్లు నిండేవరకు చదివించి ఆ తర్వాత వివాహం జరి పించాలన్నారు. జిల్లాలో ఎక్కడైనా బాల్య వివాహాల గురించి సమాచారం ఉంటే 1098కు సమాచారం అందించాలని కోరా రు. కార్యక్రమంలో చైల్డ్ హెల్ప్‌లైన్ కోఆర్డినేటర్ బాల ప్రవీణ్, సూపర్‌వైజర్ లైలా, సిబ్బంది చంద్రశేఖర్, రవళి పాల్గొన్నారు.