
గ్రౌండ్‌లో దిగి.. బ్యాట్ పట్టి
వాంకిడి(ఆసిఫాబాద్): డైలీ క్రికెట్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘వాంకిడి ప్రీమి యర్ లీగ్ సీజన్– 3’ టోర్నమెంట్ ప్రారంభో త్సవానికి మంగళవారం ఎమ్మెల్యే కోవ లక్ష్మి హాజరై క్రీడాకారులను ఉత్సాహపరిచా రు. ముందుగా క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. ఆ తర్వాత గ్రౌండులో దిగి బ్యాట్ పట్టి సరదాగా కాసేపు క్రికెట్ ఆడారు. యువత చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని సూచించారు. ఎంచుకున్న రంగంలో గుర్తింపు సాధించి పుట్టి పెరిగిన ఊరు, జిల్లా కు పేరు తీసుకురావాలన్నారు. ఎండ తీవ్రత దృష్ట్యా ఉదయం, సాయంత్రం వేళల్లో మాత్ర మే టోర్నమెంట్ నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ, బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు అజయ్‌కుమార్, నాయకులు, వ్యాపారులు జగదీష్, బండె తుకారాం, అయ్యుబ్, గాదె విలాస్, అవినాష్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.