
కళాకారులకు అవకాశం కల్పించాలి
ఆసిఫాబాద్: జిల్లాలోని కళాకారులకు టీవీ, సినిమా రంగాల్లో అవకాశం కల్పించాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే సూచించారు. శనివారం జిల్లా కేంద్రంలోని క లెక్టరేట్ సమావేశ మందిరంలో రాష్ట్ర ప్రభుత్వ భా షా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో భారత్ కల్చరల్ అకాడమీ, ఓం సాయితేజ ఆర్ట్స్ ఆధ్వర్యంలో సంయుక్తంగా జిల్లాలోని వివిధ రంగాల కళాకారులకు టీవీ, సినీ రచయితలు, దర్శకులకు ఒక్కరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. బుల్లితెర దర్శక, నిర్మా త నాగబాల సురేశ్‌కుమార్‌తో కలిసి కలెక్టర్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో కళాకారులు, క్రీడాకారుల కు కొదువలేదని, కళాకారులు వివిధ రంగాల్లో రాణిస్తున్నారని పేర్కొన్నారు. జిల్లాలో టీవీ సీరియళ్లు, సినిమా షూటింగ్‌లకు అనువైన ప్రదేశాలు చాలా ఉన్నాయని తెలిపారు. ప్రాచీన దేవాలయాలు, జలపాతాలు, సింగరేణి గనులు, సిర్పూర్ పేపర్‌మిల్లు, ప్రాణహిత, పెద్దవాగు పరీవాహక ప్రాంతాలు, కొ మురంభీమ్ ప్రాజెక్ట్ లాంటి సుందరమైన ప్రదేశాలున్నాయని పేర్కొన్నారు. జిల్లా కళాకారులు చిత్ర పరిశ్రమలో రాణించి జిల్లాకు మంచి పేరు తేవాలని ఆకాంక్షించారు. టీవీ సీరియల్ దర్శకుడు ప్రేమ్‌రాజ్, నవజ్యోతి సంస్థ ప్రతినిధులు డీ రామారావు, వెంకటేశ్వర్లు, గోపాలకృష్ణ, రాధాకృష్ణాచారి, బిట్టు వెంకటేశ్వర్లు, సునీల్, సంతోష్ తదితరులున్నారు.