
విద్యుత్ లైన్ కోసం వినూత్న నిరసన
ఆసిఫాబాద్‌అర్బన్: తిర్యాణి మండలం గోవె న పంచాయతీ పరిధిలోని నాయకపుగూడకు విద్యుత్‌లైన్ వేసేందుకు అటవీశాఖ అనుమతులు ఇవ్వాలని గ్రామస్తులు డిమాండ్ చేశా రు. ఈ మేరకు జిల్లా కేంద్రంలోని డీఎఫ్‌వో కార్యాలయం ఎదుట సోమవారం వినూత్నంగా నోటిపై చేతులు పెట్టుకుని మౌనంగా నిరసన తెలిపారు. 60 ఏళ్లుగా గ్రామానికి విద్యు త్ సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నామన్నారు. కలెక్టర్, ఐటీడీఏ పీవో, ఎమ్మెల్యేకు తమ గోడు వినిపించినా పరిష్కారం కాలేదన్నారు. విద్యుత్ సౌకర్యం కల్పించేందుకు అటవీ అధికారులు అనుమతులు మంజూరు చేసి, చీకటి నుంచి వెలుగులోకి వచ్చేందుకు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో ఎల్లయ్య, భీమయ్య, రాజం, మైసవ్వ, లస్మవ్వ, పోశవ్వ తదితరులు పాల్గొన్నారు.