
పోగొట్టుకున్న ల్యాప్‌టాప్ ప్రయాణికుడికి అందజేత
ఆసిఫాబాద్‌అర్బన్: బస్సులో పోగొట్టుకొన్న ల్యాప్‌టాప్‌ను తిరిగి ఆర్టీసీ సిబ్బంది ప్రయాణికుడికి అప్పగించారు. వివరాలు.. ఆర్టీసీ ఆసిఫాబాద్ డిపోకు చెందిన లహరి బస్సు ఈ నెల 17వ తేదీన హైదరాబాద్ నుంచి కాగజ్‌నగర్‌కు వస్తోంది. అందులో ప్రయాణిస్తున్న అజయ్‌కుమార్ తన ల్యాప్‌టాప్‌ను బస్సులోనే మరిచిపోచి కాగజ్‌నగర్ బస్టాండ్‌లో దిగి పోయాడు. బస్సు దిగిన కాసేపటికి ల్యాప్‌టా ప్‌ను అందులోనే మరిచిపోయిన విషయాన్ని గుర్తించిన అజయ్‌కుమార్ వెంటనే ఆసిఫా బాద్ డిపోకు వచ్చాడు. అక్కడి ఆర్టీసీ అధికా రులకు విషయం తెలిపాడు. వెంటనే హెడ్ కానిస్టేబుల్, ట్రాఫిక్ ఇన్‌చార్జి భారతి, కానిస్టేబుల్ విజయలక్ష్మి పర్యవేక్షణలో డ్రైవర్ సహకారంతో సదరు బస్సులో ల్యాప్‌టాప్‌ను గు ర్తించి అజయ్‌కుమార్‌కు చెందినదిగా నిర్ధారించి అతడికి అందజేశారు. అజయ్ ఆర్టీసీ సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.